బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ వీకెండ్ లో మాస్ వీరంగం సృష్టించిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఖలేజా(Khaleja4K Re Release) సినిమా మొదటి రోజు ఆల్ టైం టాప్ 2 రికార్డ్ ను క్రియేట్ చేసినా కూడా రెండో రోజు అలాగే మూడో రోజు కలెక్షన్స్ పరంగా మాత్రం..
టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. రెండో రోజు మురారి రికార్డ్ హోల్డర్ గా ఉంటే ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన ఖలేజా సినిమా మూడో రోజు కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా రీ రిలీజ్ మూవీస్ లో మూడో రోజు ముందుగా ఖుషి సినిమా ఆల్ మోస్ట్…
54 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా తర్వాత వచ్చిన మురారి మూవీ ఈ రికార్డ్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి 85 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది. ఈ రెండు సినిమాలు క్లాసిక్ హిట్ మూవీస్…కానీ వీటితో పోల్చితే బాక్స్ ఆఫీస్ దగ్గర…
రిలీజ్ అయినప్పుడు అట్టర్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఖలేజా సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 1.04 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని మాస్ ఊచకోత కోసింది….అందులో కూడా సగానికి పైగా వసూళ్లు….
ఒక్క నైజాం ఏరియా నుండే సొంతం అవ్వగా ఆంధ్ర సీడెడ్ లు అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేసి ఉంటే ఈ లెక్క ఇంకా ఎక్కువగా ఉండేది. ఓవరాల్ గా ప్రీవియస్ డే 3 రికార్డ్ మీద ఆల్ మోస్ట్ 19 లక్షల రేంజ్ లో లీడ్ తో మళ్ళీ మహేష్ తన రికార్డ్ ను తానె బ్రేక్ చేశాడు ఇప్పుడు.