Home న్యూస్ జూలై 15న ప్రభుదేవా మై డియర్ భూతం గ్రాండ్ రిలీజ్!

జూలై 15న ప్రభుదేవా మై డియర్ భూతం గ్రాండ్ రిలీజ్!

0

టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు కొరియోగ్రాఫర్‌గా సుపరిచితం ప్రభుదేవా. ఈ ఫేమ్ కంటిన్యూ చేస్తూనే హీరోగా, దర్శకుడిగా తన టాలెంట్ బయటపెట్టి ప్రశంసలందుకున్నారు ప్రభుదేవా. మరోవైపు నిర్మాతగా కూడా పలు సినిమాలకు పనిచేసి చిత్రసీమకు సూపర్ హిట్స్ అందించారు. నటుడిగా ఎన్నో సినిమాల్లో వెండితెరపై ప్రభు దేవా మార్క్ కనిపించింది. ఈ క్రమంలోనే ప్రభుదేవా ముఖ్య పాత్రలో రాబోతున్న కొత్త సినిమా ‘మై డియర్ భూతం’. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభుదేవా క్యారెక్టర్ తో పాటు అడ్వెంచర్ సీన్స్, గ్రాఫిక్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయట.

అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మై డియర్ భూతం సినిమాను నిర్మిస్తున్నారు. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్, అంతకుమించిన నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా జూలై15వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయదగ్గ చిత్రమని దర్శకనిర్మాతలు చెప్పారు. చక్కని అవుట్‌పుట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, ఈ మూవీ ప్రభుదేవా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మై డియర్ భూతం మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ సాంగ్, పోస్టర్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

ఈ ఫాంటసీ మూవీలో ఎప్పటిలాగే ప్రభుదేవా ఎంతో స్టైలిష్‌గా కనిపించడంతో పాటు కాస్త థ్రిల్ కూడా చేయబోతున్నారని ఇప్పటికే విడుదల చేసిన అప్‌డేట్స్ ద్వారా తెలిసింది. ఈ సినిమాతో మంచి మెసేజ్ కూడా ఇవ్వబోతున్నారట. జీనీకి కిడ్స్‌కి మధ్య జరిగే సన్నివేశాలతో ఈ మూవీ లోని సన్నివేశాలు అబ్బురపరచనున్నాయట. ప్రభు దేవా క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతి కలిగించేలా ఈ మూవీ తెరకెక్కించామని మేకర్స్ తెలిపారు. ఇవన్నీ తెలిసి ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ప్రభుదేవా అభిమానులతో పాటు అశేష ప్రేక్షకలోకం ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రమ్య నంబీసన్ కీలక పాత్ర పోషించగా.. బిగ్ బాస్ తమిళ్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డి. ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. యూకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాలో హైలైట్ కానుందట. వీఎఫ్ఎక్స్ వర్క్ కన్నుల పండగ కానుందని అంటున్నారు. ఇక ఈ సినిమాను ఇప్పటికే చూసిన జీ నెట్వర్క్ టీమ్.. భారీ ధర చెల్లించి మై డియర్ భూతం ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్నారు.

నటీనటులు : 
ప్రభుదేవా, రమ్యా నంబీశన్, అశ్వత్, పరం గుహనేష్, సాత్విక్, శక్తీ, కేశిత, సంయుక్త,ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ తదితరులు.

సాంకేతిక నిపుణులు :
డైరెక్టర్: ఎన్. రాఘవన్  
ప్రొడ్యూసర్ : రమేష్ పి పిళ్ళై
బ్యానర్: అభిషేక్ ఫిలిమ్స్
విడుదల : శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్
మ్యూజిక్: డి ఇమ్మాన్
సినిమాటోగ్రఫీ: యూకే సెంథిల్ కుమార్
పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here