బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ లో చాలా కాలానికి హిట్ కొట్టాడు అల్లరి నరేష్, లేటెస్ట్ మూవీ నాంది బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ నరేష్ కెరీర్ లో ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత నికార్సయిన కంబ్యాక్ మూవీ గా నిలిచి సత్తా చాటుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు లాంగ్ రన్ ని కూడా సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మంచి లాభాలను సొంతం చేసుకుంటుంది.
ఇక సినిమా డిజిటల్ రైట్స్ కి కూడా సాలిడ్ రేటు సొంతం అయింది. సినిమా రిజల్ట్ చూసి మంచి రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారు ఆహా యాప్ వాళ్ళు. సినిమా కి శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ కలుపుకు 5 కోట్ల మేర ఆఫర్ వచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అందులో ఒక్క డిజిటల్ రైట్స్ కిందే ఏకంగా 2.55 కోట్ల రేటు సొంతం చేసుకుందని సమాచారం. రిలీజ్ అయిన 3-4 వారాల గ్యాప్ లో సినిమా డిజిటల్ రిలీజ్ కాబోతుందట. అయినా ఈ రేంజ్ రేటు అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఎందుకంటే… సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్…
మొత్తం మీద 2.7 కోట్ల రేంజ్ లో ఉండగా ఇప్పుడు ఆ మొత్తం ఆల్ మోస్ట్ కేవలం డిజిటల్ రిలీజ్ తోనే వెనక్కి రావడం విశేషం. మొత్తం మీద సినిమా బడ్జెట్ 7 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా థియేట్రికల్ బిజినెస్ 2.7 కోట్లు, శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ 5 కోట్ల రేటు సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా ఇక్కడే 7.7 కోట్ల బిజినెస్ ను రికవరీ చేసిన ఈ సినిమా ఇంకా హిందీ డబ్బింగ్ బిజినెస్…
అలాగే రీమేక్ రైట్స్ కూడా మంచి రేటు కి డీల్ సెట్ అయ్యేలా ఉన్నాయని తెలుస్తుంది. అన్నీ కలుపుకుని టోటల్ గా 10-11 కోట్ల ఓవరాల్ బిజినెస్ సొంతం అయ్యే ఛాన్స్ ఉంది, అంటే సినిమా తో ఎంత లేదన్నా 3- 4 కోట్ల రేంజ్ ప్రాఫిట్ నిర్మాతలకు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు…