మన దగ్గర అంటే టాప్ స్టార్స్ చాలామంది ఉండటంతో ఆడియన్స్ లో ఫ్యాన్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యారని చెప్పాలి. కానీ కోలివుడ్ లో ప్రజెంట్ టాప్ స్టార్స్ మాత్రం ఇద్దరే ఉన్నారు…. దళపతి విజయ్(Thalapathy Vijay) మరియు అజిత్ కుమార్(Ajith Kumar)లు….
సోషల్ మీడియాలో రీసెంట్ టైంలో ఏ రికార్డులు వచ్చినా వీళ్ళవే కాగా, ఈ ఇద్దరిలో కూడా విజయ్(Vijay) నెక్స్ట్ లెవల్ ఫాంలో ఉండగా ప్రతీ సినిమాకి సోషల్ మీడియాలో అనేక రికార్డులను నెలకొల్పుతూ ఉన్న విజయ్ ఫ్యాన్స్ ఇప్పుడు లేటెస్ట్ గా…
విజయ్ లోకేష్ కనగారాజ్ ల కాంబోలో వస్తున్న లియో(LEO MOVIE) నుండి ఫస్ట్ సాంగ్ నా రెడీ(Naa Ready Song) ను రిలీజ్ చేయగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రికార్డ్ వ్యూస్ అండ్ లైక్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం. సినిమాల టీసర్ లకు ట్రైలర్ లకు రికార్డ్ లెవల్ లో…
వ్యూస్ అండ్ లైక్స్ రావడం కామన్, కానీ లిరికల్ వీడియోలకు కూడా రికార్డ్ లెవల్ లో వ్యూస్ అండ్ లైక్స్ వస్తూ ఉండటం ఒక్క విజయ్ కే చెల్లింది. ఇప్పుడు నా రెడీ సాంగ్ కి కేవలం 2 నిమిషాల్లో 1 లక్ష లైక్స్ గంటా 53 నిమిషాల్లో 1 మిలియన్ లైక్స్ సొంతం అయ్యాయి…
2 గంటల లోపే 1 మిలియన్ లైక్స్ ని అందుకోవడం అన్నది మాములు విషయం కాదనే చెప్పాలి. ఈ రేంజ్ లో రికార్డులు విజయ్ రీసెంట్ టైంలో నాన్ స్టాప్ గా సొంతం చేసుకుంటూ ఉండగా సోషల్ మీడియా రికార్డుల విషయంలో ప్రజెంట్ సౌత్ హీరోలలోనే బిగ్గెస్ట్ రికార్డ్ హోల్డర్ గా ఉన్నాడని చెప్పాలి.