Home గాసిప్స్ నాగ్ మండి పడ్డా….సాలిడ్ OTT రేటు….ఈ సారి పక్కా!

నాగ్ మండి పడ్డా….సాలిడ్ OTT రేటు….ఈ సారి పక్కా!

3219
0

కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ ని 2015 లో అఖిల్ తో మొదలు పెట్టాడు కానీ ఇప్పటి వరకు మొదటి క్లీన్ హిట్ ని సొంతం చేసుకోవాల్సి ఉంది, ఇలాంటి టైం లో లాస్ట్ ఇయరే ఆడియన్స్ ముందుకు రావాల్సిన అఖిల్ అక్కినేని మరియు బొమ్మరిల్లు భాస్కర్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా ఫస్ట్ వేవ్ ఎఫెక్ట్ వలన…

రిలీజ్ కి నోచుకోలేదు, మళ్ళీ ఇప్పుడు 2021 సమ్మర్ రిలీజ్ అనుకుంటే సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన సినిమా రిలీజ్ నిరవధికంగా వాయిదా పడగా సినిమా కి మిగిలిన సినిమాల మాదిరిగానే డిజిటల్ రిలీజ్ కి గాను మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ కింగ్ నాగార్జున మాత్రం ఈ సినిమా…

Wild Dog Total World Wide Collections!

ఎట్టి పరిస్థితులలో థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ ఆఫర్స్ కి నో చెప్పారట, కానీ ఈ సినిమా నిర్మాత అయిన బన్నీ వాసు మాత్రం ఇప్పుడు సెకెండ్ వేవ్ వలన పరిస్థితులు మొత్తం మారిపోయాయి అని, వేవ్ ఎఫెక్ట్ తగ్గిన వెంటనే థియేటర్స్ లో సమ్మర్ సినిమాలు అన్నీ…

వరుస పెట్టి రిలీజ్ అవుతాయని, అప్పుడు జూన్ జులై లలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాల మీద ఆ ఎఫెక్ట్ గట్టిగా ఉంటుందని, ఇలాంటి టైం లో డిజిటల్ రిలీజ్ లు చేసుకోవడం ఉన్నంతలో బెటర్ ఆప్షన్ అంటూ చెబుతూ పరిస్థితులు అనుకూలించక పొతే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ కూడా ఇలానే రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇక ఈ మాటకి సినిమా కి…

డిజిటల్ రిలీజ్ ఆఫర్స్ కింద సాలిడ్ రేట్లు ఆఫర్ వస్తున్నాయట, పెర్ఫెక్ట్ రేటు బయటికి రాకున్న లెక్క 25 కోట్లకు పైగానే రేటు ఆఫర్స్ వస్తున్నాయని టాలీవుడ్ లో టాక్ ఉంది, పరిస్థితులు ఇప్పట్లో సెట్ అయ్యేలా కనిపించడం లేదు కాబట్టి ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కి ఆల్ మోస్ట్ రంగం సిద్ధమే అంటూ ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here