Home న్యూస్ నాగ చైతన్య లాస్ట్ 5 మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్…కుమ్ముతున్నాడు!!

నాగ చైతన్య లాస్ట్ 5 మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్…కుమ్ముతున్నాడు!!

4540
0

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో ప్రస్తుతం పీక్ స్టేజ్ లో క్రేజ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పాలి. కెరీర్ లో బెస్ట్ ఫేస్ ని వరుస పెట్టి సినిమాలు సాలిడ్ కలెక్షన్స్ తో సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతున్న నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ అనిపించే విధంగా దుమ్ము దుమారం చేసింది…

సినిమా ఏకంగా 6.94 కోట్ల షేర్ ని మొదటి రోజు సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇవి సోలో హీరోగా నాగ చైతన్య కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. ఒకసారి నాగ చైతన్య రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

ముందుగా రారండోయ్ వేడుక చూద్దాం సినిమా మొదటి రోజు 4.2 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా తర్వాత చేసిన యుద్ధం శరణం సినిమా మొదటి రోజు 1.86 కోట్ల షేర్ తో భారీగా నిరాశ పరిచింది. ఇక తర్వాత చేసిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా మొదటి రోజు…

6.93 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక తర్వాత చేసిన సవ్యసాచి సినిమా మళ్ళీ నిరాశ పరుస్తూ 3.29 కోట్ల షేర్ నే సాధించింది. ఇక తర్వాత చేసిన మజిలీ సినిమా మొదటి రోజు 5.6 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా తర్వాత వెంకటేష్ తో కలిసి చేసిన మల్టీ స్టారర్ మూవీ వెంకీ మామ 7.05 కోట్ల షేర్ ని మొదటి రోజు…

సొంతం చేసుకుంది, ఇక ఇప్పుడు లవ్ స్టొరీ సినిమా మొదటి రోజు 6.94 కోట్ల షేర్ తో సోలో హీరోగా కెరీర్ లో హైయెస్ట్ షేర్ ని అందుకుంది. టోటల్ మూవీస్ పరంగా చూసుకుంటే ఇది టాప్ 2 ప్లేస్ ని అందుకుందని చెప్పొచ్చు. పరిస్థితులు బాగుంటే సినిమా తెలుగు రాష్ట్రాల నుండే 10 కోట్ల రేంజ్ షేర్ తో ఓపెన్ అయ్యి ఉండేది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here