Home గాసిప్స్ 20 కోట్లు ఏంటి సామి…నాగ చైతన్య మాస్ పవర్!

20 కోట్లు ఏంటి సామి…నాగ చైతన్య మాస్ పవర్!

0

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య బాక్స్ ఆఫీస్ దగ్గర 2019 లో మజిలీ సినిమా తో తన కెరీర్ బెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్నాడు, కెరీర్ లో తొలిసారి 40 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసిన నాగ చైతన్య ఆ సినిమా తర్వాత చేస్తున్న సినిమా లవ్ స్టొరీ. ఫిదా తో సెన్సేషనల్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఫిదాతోనే సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కుతున్న లవ్ స్టొరీ సినిమాతో…

ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16 న రాబోతున్నాడు నాగ చైతన్య. కెరీర్ బెస్ట్ కొట్టిన ఊపులో ఉండటం, అలాగే సినిమా డైరెక్టర్ అండ్ హీరోయిన్ కూడా ఫుల్ ఫాం లో ఉండటం సినిమా పై అంచనాలు అయితే సాలిడ్ గానే ఉన్నాయి అని చెప్పాలి.

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో తెలియదు కానీ రిలీజ్ కి ఇంకా టైం ఉండగానే సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ మాత్రం కంప్లీట్ అయ్యి సాలిడ్ రేటు ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఒక సారి ఆ వివరాలను గమనిస్తే… సినిమా శాటిలైట్ రైట్స్ కింద…

8 కోట్ల రేటు ని స్టార్ మా ఛానెల్ దక్కించుకుందట, ఇక సినిమా డిజిటల్ రైట్స్ ని ఆహా యాప్ వాళ్ళు 6 కోట్ల సాలిడ్ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారట. ఇక సినిమా కి హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ కింద 6 కోట్ల రేటు సొంతం అయిందట. ఇక మ్యూజిక్ రైట్స్ కింద మరో 50 లక్షల వరకు ఈ సినిమా దక్కింది అంటున్నారు. దాంతో ఓవరాల్ గా సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం మీద…

20.5 కోట్ల సెన్సేషనల్ రేటు ని సొంతం చేసుకుందని అంటున్నారు ట్రేడ్ వర్గాలలో…ఇది నిజంగానే సాలిడ్ రేటు అనే చెప్పాలి. సినిమా పోటి లో రిలీజ్ అవుతున్నా కానీ ఈ రేంజ్ లో నాన్ థియేట్రికల్ బిజినెస్ ని సాధించడంతో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాధించే కలెక్షన్స్ బోనస్ అనే చెప్పాలి. ఏప్రిల్ 16 న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here