Home న్యూస్ 265 కోట్ల బ్లాక్ బస్టర్ రీమేక్ లో నాగ చైతన్య?…క్లారిటీ వచ్చేసిందిగా!!

265 కోట్ల బ్లాక్ బస్టర్ రీమేక్ లో నాగ చైతన్య?…క్లారిటీ వచ్చేసిందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ నాగ చైతన్య(Naga Chaitanya) ప్రస్తుతం వరుస ఫ్లాఫ్స్ తో కెరీర్ లో డౌన్ ఫాల్ లో ఉన్నాడు….. బాక్ టు బాక్ థాంక్ యు మరియు కస్టడీ సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుని బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ గా నిలిచాయి. ఇలాంటి టైంలో నాగ చైతన్య ఎలాంటి సినిమాతో కంబ్యాక్ ఇస్తాడు అన్నది ఆసక్తిగా మారగా…

రీసెంట్ గా టాలీవుడ్ లో నాగ చైతన్య ఓ భారీ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు రీమేక్ లో నటించబోతున్నాడు అన్న వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఆ సినిమా మరేదో కాదు, లాస్ట్ ఇయర్ బాలీవుడ్ వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్న టైంలో మీడియం అంచనాలతో రిలీజ్ అయ్యి…

బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన భూల్ భులయ్య2 సినిమా తెలుగు రీమేక్ లో నాగ చైతన్య నటిస్తున్నాడు అన్న టాక్ వినిపించింది. ఈ సినిమా టోటల్ రన్ లో 265 కోట్ల గ్రాస్ ను అందుకుని దుమ్ము దుమారం లేపింది. అలాంటి సినిమా తెలుగు రీమేక్ అనే సరికి నాగ చైతన్యకి బాగా సెట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు కానీ…

లేటెస్ట్ గా నాగ చైతన్య టీం నుండి అఫీషియల్ గా దీనిపై అప్ డేట్ వచ్చింది, నాగ చైతన్య ఈ రీమేక్ లో నటించడం లేదని అనౌన్స్ చేశారు. ఇవి కేవలం రూమర్స్ మాత్రమేనని నాగ చైతన్య భూల్ భులయ్య2 తెలుగు రీమేక్ ఏమి చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. దాంతో నాగ చైతన్య ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటే ఇప్పుడు ఏ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకుంటాడో చూడాలి.

Custody Movie Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here