Home న్యూస్ మీడియం రేంజ్ హీరోల్లో ఈ రికార్డ్ కొట్టిన ఒకే ఒక్కడు నాగ చైతన్య!!

మీడియం రేంజ్ హీరోల్లో ఈ రికార్డ్ కొట్టిన ఒకే ఒక్కడు నాగ చైతన్య!!

5431
0

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు వరుస విజయాలతో యమ జోరుగా కెరీర్ లో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్నాడు, కెరీర్ మొదలు పెట్టడం జోష్ సినిమాతో మొదలు పెట్టగా ఆ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకున్నా ఆశించిన సక్సెస్ దక్కలేదు, కానీ తర్వాత చేసిన ఏ మాయ చేసావేతో సూపర్ హిట్ కొట్టిన నాగ చైతన్య తర్వాత మాస్ మూవీస్ పరంగా…

Love Story 1st Day Total World Wide Collections!!

నిరాశ పరుస్తూ వచ్చినా లవ్ స్టోరీల విషయంలో మాత్రం చాలా సార్లు సక్సెస్ అవ్వగా మాస్ ఇమేజ్ కోసం ట్రై చేయకుండా లవ్ స్టొరీల స్పెషలిస్ట్ గా మారిపోయి ఇప్పుడు వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. మజిలీకి ముందు వరుస ఫ్లాఫుల్లో ఉన్న నాగ చైతన్య ఆ సినిమా తో….

Love Story 3 Days Total Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని తర్వాత వెంకటేష్ తో కలిసి చేసిన వెంకిమామతో మరో సూపర్ హిట్ ని అందుకుని రీసెంట్ గా లవ్ స్టొరీ సినిమా తో మరో సూపర్ హిట్ ని సొంతం చేసుకుని బాక్ టు బాక్ హాట్రిక్ సూపర్ హిట్స్ తో దుమ్ము దులిపేశాడు.

Love Story 5 Days Total Collections!!

ఇక్కడ మరో రికార్డ్ ను మీడియం రేంజ్ హీరోల్లో ఎవ్వరూ సాధించని విధంగా సొంతం చేసుకున్నాడు నాగ చైతన్య, మీడియం రేంజ్ హీరోలలో బాక్ టు బాక్ 35 కోట్ల మూవీస్ ను మూడు సార్లు వరుస పెట్టి సొంతం చేసుకున్న ఒకే ఒక్క హీరోగా నాగ చైతన్య అల్టిమేట్ రికార్డ్ ను ఇప్పుడు నమోదు చేశాడు… వెంకిమామ మల్టీ స్టారర్ కౌంట్ అవ్వదు అనుకున్నా కానీ…

బాక్ టు బాక్ 35 కోట్ల సినిమాను 2 సార్లు సొంతం చేసుకున్న హీరోగా కూడా నిలిచాడు… ఇలా కెరీర్ బెస్ట్ ఫాంతో దూసుకు పోతున్న నాగ చైతన్య క్రేజీ కాంబినేషన్ లు లేకున్నా కానీ సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటున్నాడు. ఇలానే ఇంకొన్ని సాలిడ్ హిట్స్ పడితే స్టార్ హీరోల జాబితాలో నాగ చైతన్య ఎంటర్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here