Home గాసిప్స్ కెరీర్ లో అపజయం అంటే తెలియని డైరెక్టర్ తో నాగచైతన్య సినిమా!

కెరీర్ లో అపజయం అంటే తెలియని డైరెక్టర్ తో నాగచైతన్య సినిమా!

4878
0

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కెరీర్ బెస్ట్ ఫాం అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ని 2019  ఇయర్ లో మజిలీ సినిమా తో సొంతం చేసుకోవడమే కాకుండా తొలి 40 కోట్ల సినిమా తో దుమ్ము లేపిన నాగ చైతన్య ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ అన్నీ అనుకున్నట్లు జరిగితే… మినిమమ్ 50-60 కోట్లు కలెక్ట్ చేయడం ఏమాత్రం కష్టం కాదు…

అంతకుమించి కూడా కలెక్ట్ చేసే సత్తా ఈ సినిమా కి ఉందని చెప్పాలి. కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుంది అన్న టాక్ ఇండస్ట్రీ లో మొదటి నుండి వినిపిస్తుండగా…. ఈ సినిమా తర్వాత నాగ చైతన్య విక్రం కుమార్ డైరెక్షన్ లో థాంక్ యు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..

విక్రం కుమార్ ప్రస్తుతం పెద్దగా ఫాం లో లేకున్నా వీళ్ళ కాంబినేషన్ చాలా కొత్తగా ఉండటం విక్రం ఇది వరకు అక్కినేని ఫ్యామిలీ తో మనం లాంటి క్లాసిక్ ఇవ్వడం తో ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది… ఇక ఈ సినిమా తో పాటు నాగ చైతన్య మరో సినిమా కమిట్ అవ్వడానికి సిద్ధం అవుతున్నాడు అన్నది లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్.

2015 లో బ్లాక్ బస్టర్ పటాస్ తో కెరీర్ ని మొదలు పెట్టి, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు లాంటి వరుస సూపర్ హిట్ల డైరెక్టర్ అపజయం తెలియకుండా కెరీర్ ని కొనసాగిస్తున్న అనిల్ రావిపూడి తో నాగ చైతన్య సినిమా ఉండే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఎఫ్ 3 ని ముగించే పనిలో ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమా అయిన తర్వాత బాలయ్యతో,

మహేష్ తో సినిమాలు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు, కాగా మహేష్ తో మూవీ కొంచం డిలే అయితే నాగచైతన్య తో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందట, ఒకవేళ మిస్ అయినా రెండు ప్రాజెక్ట్ లు కంప్లీట్ చేసుకుని నాగచైతన్య తో సినిమా చేస్తాడని టాలీవుడ్ టాక్… ఎంటర్ టైనర్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ గట్టిగా ఉండేలా చూసుకునే అనిల్ తో నాగ చైతన్య సినిమా పెర్ఫెక్ట్ గా మాస్ లో నాగ చైతన్య క్రేజ్ ని మరింత సాలిడ్ గా పెంచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here