బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీ కోవిడ్ టైంలో హిట్ ట్రాక్ ఎక్కి మజిలీ, తర్వాత లవ్ స్టోరీ లాంటి సోలో సూపర్ హిట్స్ అలాగే వెంకిమామ మరియు బంగార్రాజు లాంటి మల్టీ స్టారర్ హిట్స్ తో దుమ్ము లేపినా కూడా యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) తర్వాత చేసిన థాంక్ యు మరియు కస్టడీ లాంటి సినిమాలు…
బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచి భారీ డిసాస్టర్లు గా నిలిచాయి. ఇలాంటి టైంలో కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో నాగ చైతన్య చేసిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా సాలిడ్ హైప్ ను సొంతం చేసుకుని ఇప్పుడు ఈ వీకెండ్ లో రిలీజ్ కానుండగా…
నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ సోలో హీరోగా సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. వరుస ఫ్లాఫ్స్ తర్వాత కూడా కెరీర్ బెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుంటూ 37 కోట్ల రేంజ్ రేటుని అందుకుని దుమ్ము లేపగా…
ఓవరాల్ గా నాగ చైతన్య రీసెంట్ టైంలో నటించిన 6 సోలో మూవీస్ బిజినెస్ లెక్కలు కలిపి 160 కోట్ల మార్క్ ని దాటేయడం విశేషం అని చెప్పాలి. ఇతర మీడియం రేంజ్ హీరోలతో పోల్చితే ఫ్లాఫ్స్ లో కూడా సూపర్ హోల్డ్ ని బిజినెస్ లో చూపెడుతూ దూసుకు పోతున్నాడు నాగ చైతన్య.
ఒకసారి నాగ చైతన్య రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
#NagaChaitanya Recent Movies Pre Release Business
👉#Thandel – 37CR*******
👉#Custody – 24.05CR
👉#ThankYouMovie – 24CR
👉#LoveStory – 31.20CR
👉#Majili – 21.14CR
👉#Savyasachi – 23CR
ఓవరాల్ గా లాస్ట్ 5 సినిమాలనే చూసుకున్నా కూడా 137.39 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా యావరేజ్ గా ఒక్కో సినిమా కి 27.50 కోట్ల లోపు బిజినెస్ ను అందుకుంటూ మంచి ఫామ్ తోనే దూసుకు పోతున్నాడు. ఇక తండేల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నాగ చైతన్య ఏ రేంజ్ కంబ్యాక్ ని ఇస్తుందో చూడాలి.