Home న్యూస్ టాప్ 2 తో నాగార్జున రికార్డ్….రియల్ కింగ్!!

టాప్ 2 తో నాగార్జున రికార్డ్….రియల్ కింగ్!!

617
0

సీనియర్ హీరోల్లో ఇప్పటికీ ఏజ్ తెలియకుండా నవ మన్మథుడు గా ఎప్పుడు ఎవర్ చార్మ్ గా ఉండే హీరో కింగ్ నాగార్జున. లేడీ ఫాలోయింగ్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ కానీ సరైన సినిమా పడితే నాగార్జున బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ రేంజ్ లో రాంప్ ఆడేస్తారు… లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ 3 ని హోస్ట్ చేసి సూపర్ సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం కూడా అయ్యాడు కింగ్ నాగార్జున.

Tollywood Actors Top Anniversary Trends

ఇక సోషల్ మీడియా లో తన ఫాలోయింగ్ కూడా అదుర్స్ అనిపించేలా ఉంది, ట్విట్టర్ లో నేటి స్టార్ హీరోల లో చాలా మందిని మించేలా దూసుకు పోతున్న నాగార్జున రీసెంట్ గా ట్విట్టర్ లో 6 మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించాడు.

సీనియర్స్ లో కొందరి కి మాత్రమె ట్విట్టర్ అకౌండ్ ఉండగా వెంకీ, చిరు లాంటి వాళ్ళు ఈ మధ్య నే ట్విట్టర్ లో జాయిన్ అయ్యారు. ఇక బాలయ్య ట్విట్టర్ లో లేరు, దాంతో సీనియర్స్ లో ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉన్నది నాగార్జున ఒక్కరే అవ్వడం తో భారీగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నాడు.

టాలీవుడ్ తరుపున ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్స్ లిస్టులో తానూ కూడా ఒకరిగా నిలిచాడు. ఒకసారి ఈ రోజు వరకు ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోలు ఎవరనేది గమనిస్తే
👉#MaheshBabu – 9.9M
👉#Nagarjuna – 6M
👉#RanaDaggubati – 6M
👉#AlluArjun – 4.7M
👉#NTR – 4.1M
👉#PawanKalyan- 3.9M
👉#Nani – 3.7M
👉#Nithiin – 2.9M
👉#AkhilAkkineni – 2.6M
👉#VarunTej – 2.6M

ఇలా ట్విట్టర్ లో టాప్ 2 మోస్ట్ ఫాలోవుడ్ టాలీవుడ్ హీరోగా మహేష్ తర్వాత రికార్డ్ కొట్టాడు నాగార్జున, లిస్టు మొత్తం మీద ఉన్న ఓకే ఒక్క సీనియర్ హీరో అలాగే టాప్ 2 ప్లేస్ ని సొంతం చేసుకున్న సీనియర్ హీరో కూడా నాగార్జునే అవ్వడం విశేషం, దాంతో మరోసారి రియల్ కింగ్ అనిపించుకున్నాడు నాగార్జున…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here