Home గాసిప్స్ అసలే ఫ్లాఫ్స్…అయినా రిస్క్ చేస్తున్న కింగ్!!

అసలే ఫ్లాఫ్స్…అయినా రిస్క్ చేస్తున్న కింగ్!!

875
0

 

  బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరి ఫాం ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు చెప్పలేం, హిట్స్ మీద హిట్స్ కొడుతున్న వాళ్ళు సడెన్ గా ఫ్లాఫ్స్ ని ఎదురుకోవచ్చు, ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్న వాళ్ళు వరుస హిట్స్ తో జోరు చూపోచ్చు. కానీ తెలిసి తెలిసి రిస్క్ చేస్తున్న హీరోల్లో సీనియర్ హీరో అయిన కింగ్ నాగార్జున ముందు నిలుస్తారు అని చెప్పాలి. రిస్క్ అని తెలిసినా… చేసి సక్సెస్ వస్తే ఆ కిక్ వేరు…

అందుకే వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కానీ ఎప్పటి కప్పుడు హిట్స్ కి ఫ్లాఫ్స్ కి తేడా లేకుండా రిస్క్ తీసుకునే ప్రాజెక్ట్స్ ని ఎక్కువగా చేస్తాడు కింగ్ నాగార్జున. బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ ఉన్న టైం లో సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి లాంటి డిఫెరెంట్ రిస్క్ ఉన్న…

సినిమాలు చేసే సూపర్ హిట్లు కొట్టాడు కింగ్, కానీ తర్వాత మాత్రం వరుస ఫ్లాఫ్స్ మళ్ళీ ఎదురు అయ్యాయి. అయినా కానీ తన లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్ తో రిస్క్ చేస్తున్న నాగార్జున ఈ సినిమా తర్వాత కూడా మరో రిస్క్ చేసే ఆలోచనలో ఉన్నారు…

గరుడ వేగ లాంటి క్వాలిటీ మూవీ ని మీడియం రేంజ్ బడ్జెట్ తో రూపొందించి మెప్పించిన ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ ని ప్లాన్ చేసే పనిలో ఉన్నారని లేటెస్ట్ టాక్, సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ మొదలు పెడతాడు అనుకున్నా దానికన్నా ముందు ఈ సినిమాలు చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యారట.

వైల్డ్ డాగ్ ఆల్ మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అవ్వగా త్వరలో పెండింగ్ వర్క్ కూడా అయిపోతుందట, తర్వాత ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తన కొత్త సినిమా చేసే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తుంది, అసలే వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా మళ్ళీ రిస్క్ చేస్తున్న నాగార్జున ఈ సినిమాలతో సక్సెస్ ని అందుకుంటాడో లేదో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here