Home న్యూస్ కింగ్ నాగార్జునకి బాలీవుడ్ లో సెన్సేషనల్ రెస్పాన్స్!!

కింగ్ నాగార్జునకి బాలీవుడ్ లో సెన్సేషనల్ రెస్పాన్స్!!

0

రణబీర్ కపూర్, ఆలియా భట్ ల కాంబినేషన్ లో అమితాబ్ బచ్చన్ మరియు కింగ్ నాగార్జునల స్పెషల్ రోల్స్ తో వస్తున్న సెన్సేషనల్ సోషియో ఫాంటసీ మూవీ బ్రహ్మాస్త్ర…. సెప్టెంబర్ 9న ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రావడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా గ్రాఫిక్స్ కి కొంచం మిశ్రమ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ ఓవరాల్ గా ట్రైలర్ కి మాత్రం ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయింది.

కాగా ట్రైలర్ లో రణబీర్ కపూర్ ఎప్పటి లానే హైలెట్ అయినా కానీ చాలా టైం తర్వాత తిరిగి బాలీవుడ్ లో అడుగు పెడుతున్న కింగ్ నాగార్జునకి మాత్రం యునానిమస్ రెస్పాన్స్ సొంతం అవ్వడమే కాదు సోషల్ మీడియాలో నాగ్ పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

శివ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ ను అందరు హీరోల కన్నా ముందే సొంతం చేసుకున్న నాగార్జున తర్వాత అనుకున్న రేంజ్ లో హిట్స్ పడక పోయినా మాస్ మూవీ హిందీ డబ్ తో తిరుగులేని క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతున్న బ్రహ్మాస్త్ర తో బాలీవుడ్ లో మరోసారి దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here