బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమాతో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోశాడు. సినిమా మీద అంచనాలు ఉన్నాయి..ఓపెనింగ్స్ బాగా వస్తాయి అని అందరూ అనుకున్నదే… కానీ ఏ సర్టిఫికేట్ తెచ్చుకున్న సినిమా..
జానర్ కంప్లీట్ గా వైలెంట్ అయినా కూడా అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను మొదటి రోజున సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది…అది ఏ రేంజ్ లో అంటే ఏకంగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా….
ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్ డే గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకునే రేంజ్ లో ఊచకోత కోసింది సినిమా….టాలీవుడ్ లో ఇది వరకు బిగ్గెస్ట్ డే 1 గ్రాస్ ఓపెనింగ్స్ రికార్డ్ కూడా నాచురల్ స్టార్ నాని పేరిటే ఉంది…రెండేళ్ళ క్రితం నాని నటించిన దసరా సినిమా…
మొదటి రోజున ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసింది…ఆ ఓపెనింగ్స్ ను ఇప్పటి వరకు ఇతర మీడియం రేంజ్ హీరోలు ఎవ్వరూ కూడా అందుకోలేక పోయారు…కానీ ఇప్పుడు తిరిగి నాని మళ్ళీ తనే తన రికార్డ్ ను మళ్ళీ అందుకుని మాస్ ఊచకోత కోసి సంచలనం సృష్టించాడు.
టాలీవుడ్ లో ఇప్పుడు మీడియం రేంజ్ హీరోల సినిమాల ఓపెనింగ్స్ పరంగా ఆల్ టైం రికార్డ్ టాప్ 2 కలెక్షన్స్ ని తన పేరిటే సొంతం చేసుకున్న నాని అందరు హీరోలను ఓ రేంజ్ లో డామినేట్ చేస్తూ ఉండగా వచ్చే ఏడాది మళ్ళీ పారడైజ్ సినిమాతో…
బాక్స్ ఆఫీస్ ను మరో లెవల్ లో కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉండగా…ఇక ఇతర మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా కొన్ని మంచి అంచనాల నడుమ రిలీజ్ కానున్న నేపధ్యంలో నాని హిట్3 మరియు దసరా రేంజ్ లో ఏ సినిమాలు జోరు చూపిస్తాయో చూడాలి.