బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ ప్రజెంట్ మీడియం రేంజ్ హీరోలలో సూపర్బ్ ఫామ్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమాతో ఇప్పుడు మరోసారి మాస్ భీభత్సం సృష్టిస్తూ దుమ్ము దుమారం లేపుతూ ఉండటం విశేషం…
వీక్ మిడ్ డే లో రిలీజ్ అయిన హిట్3 మూవీ అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను అందుకుంటూ ఉండగా ఆల్ రెడీ నాని కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది. నార్త్ అమెరికాలో నాని కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేసి…
సరికొత్త రికార్డ్ ను సృష్టించింది ఈ సినిమా…ఇది వరకు నాని నటించిన దసరా మూవీ ప్రీమియర్స్ కి ఆల్ మోస్ట్ 640K లోపు డాలర్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. కానీ ఏ సర్టిఫికేట్ తెచ్చుకున్న వైలెంట్ మూవీ అయిన హిట్3 మూవీ వీక్ మిడ్ డే లో రిలీజ్ అయినా…
కూడా నార్త్ అమెరికాలో ఊహకందని రేంజ్ లో ఊచకోత కోస్తూ ఆల్ మోస్ట్ 850K డాలర్స్ మార్క్ ని ఆల్ రెడీ క్రాస్ చేసి 900K మార్క్ కి పైగానే వసూళ్ళని అందుకోబోతుంది. ఆల్ మోస్ట్ టాప్ స్టార్స్ నటించిన సినిమాలకు వచ్చే రేంజ్ ఓపెనింగ్స్ అని చెప్పాలి ఇవి…
నాని సినిమాలకు నాని బ్రాండ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పడానికి ఇది నిదర్శనం అని చెప్పాలి. ఆడియన్స్ లో ఎక్స్ లెంట్ ట్రస్ట్ ను బిల్డ్ చేసుకుంటున్న నాని ఇప్పుడు హిట్3 తో సాలిడ్ రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఇక లాంగ్ వీకెండ్ లో ఏ రేంజ్ లో ఊచకోత కోస్తాడో చూడాలి ఇప్పుడు.