చప్పగా సాగుతున్న సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధం అవుతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) మంచి బజ్ నడుమ రిలీజ్ కానుండగా ఆల్ రెడీ సినిమా మీద ఆడియన్స్ లో మంచి బజ్ ఏర్పడింది. దాంతో బిజినెస్ పరంగా కూడా…
కుమ్మేస్తూ దూసుకు పోతున్న సినిమా ఇప్పుడు సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుని ఫస్ట్ టాక్ బయటికి వచ్చేసింది…స్టోరీ పాయింట్ ను ఆల్ రెడీ మేకర్స్ ట్రైలర్ లో చెప్పేశారు కానీ అసలు కథ డిఫెరెంట్ గా ఉండబోతుందని సమాచారం..
ఫస్టాఫ్ మొత్తం సినిమా ఇన్వెస్టిగేషన్ నేపధ్యంలో సాగగా సెకెండ్ ఆఫ్ మొత్తం స్కైడ్ గేమ్ టైంలో సర్వైవల్ నేపధ్యంలో ఉండబోతుందని సమాచారం….నాని ఫస్ట్ ఫ్రేం నుండే మాస్ రాంపెజ్ ను చూపించాడట…తన డైలాగ్స్, స్క్రీన్ ప్రజెన్స్ అలాగే యాటిట్యూడ్ సినిమాకి…
మేజర్ హైలెట్ అని అంటూ ఉండగా ఇక హీరోయిజం ఎలివేట్ సీన్స్ కూడా మరో లెవల్ లో ఉన్నాయని సమాచారం, ఓవరాల్ గా సినిమాలో సాంగ్స్ తక్కువే అయినా కూడా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా సాంగ్స్ ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ మేజర్ హైలెట్ అని అంటున్నారు..
మొత్తం మీద సినిమా ఫస్టాఫ్ ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించగా సెకెండ్ ఆఫ్ హిట్ రేంజ్ లో ఉంటుందని అయితే సెన్సార్ రిపోర్ట్ వినిపిస్తుంది… సినిమా ఓవరాల్ గా 2 గంటల 36 నిమిషాల రన్ టైం తో తెరకెక్కగా ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న సినిమాలో..
వైలన్స్ కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగినా కూడా ఈ జానర్ ఇష్టపడే ఆడియన్స్ కి మాత్రం సినిమా ఓ రేంజ్ లో ఎక్కేలా ఉంటుందని అంటున్నారు… ఓవరాల్ గా సెన్సార్ వాళ్ళ నుండి హిట్3 మూవీ కి ఓవరాల్ గా సినిమా రిపోర్ట్ ఎబో యావరేజ్ టు హిట్ రేంజ్ లో…
రెస్పాన్స్ అయితే వినిపిస్తూ ఉందని చెప్పాలి. ఇక ఇదే రేంజ్ లో రెస్పాన్స్ ఆడియన్స్ నుండి రిలీజ్ అయ్యాక సొంతం అయితే కచ్చితంగా సమ్మర్ టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర సాలడ్ కలెక్షన్స్ తో సినిమా మాస్ కుమ్ముడు కుమ్మేయడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.