నాచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి మరియు కృతి శెట్టిలు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ సినిమా ఆల్ మోస్ట్ నాని నుండి థియేటర్స్ లో 2019 గ్యాంగ్ లీడర్ తర్వాత రిలీజ్ కాబోతున్న మొదటి సినిమా, మధ్యలో వి మూవీ అలాగే టక్ జగదీష్ సినిమాలు రెండూ కూడా డిజిటల్ లోనే రిలీజ్ అవ్వడంతో ఎట్టి పరిస్థితులలో ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ…
ఫిక్స్ అయిన నాని ఇప్పుడు సినిమాను 24న రిలీజ్ చేయబోతుండగా రీసెంట్ గా సినిమా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని U/A సర్టిఫికేట్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది అని చెప్పాలి. సినిమా పై డీసెంట్ నుండి మంచి అంచనాలు ఆడియన్స్ లో ఉండగా…
సెన్సార్ నుండి కూడా సినిమా మంచి టాక్ లభిస్తుంది అనే చెప్పాలి. లెంత్ సుమారు 2 గంటల 37 నిమిషాలు ఉన్నప్పటికీ కథ చాలా వరకు ఎంగేజింగ్ గా ఉంటుందని, ఫస్టాఫ్ ప్రజెంట్ టైం లో డైరెక్టర్ అవ్వాలని సాఫ్ట్ వేర్ జాబ్ ని వదిలేసి కష్టపడే హీరో కి హెల్ప్ చేసే అమ్మాయిగా హీరోయిన్ కృతి శెట్టి…
ఉంటుందని, అనుకోకుండా జరిగిన ఓ ఇంసిడెంట్ లో పూర్వజన్మ గుర్తు చేసుకున్న హీరోకి పూర్వజన్మలో తాను, సాయి పల్లవి ఎలా ప్రేమించుకున్నారు, వాళ్ళ ప్రేమకి ఎలాంటి అడ్డంకులు వచ్చాయి అన్న సీన్స్ తో ఫ్లాష్ బ్యాక్ లెంత్ కొంచం ఎక్కువగానే ఉన్నా తర్వాత సీన్స్ బాగుంటాయని, సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది అంటున్నారు. ఓవరాల్ గా సినిమా…
ఎంటర్ టైన్ మెంట్, పూర్వజన్మ ఎక్సైట్ మెంట్ తర్వాత కంక్లూజన్ ఇలా అన్నీ ఆకట్టుకున్నా కమర్షియల్ గా ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది చూడాలి అంటున్నారు. సినిమా మాత్రం ఓవరాల్ గా బాగుంది అన్న టాక్ అక్కడ నుండి వినిపిస్తుంది. ఇక రెగ్యులర్ షోలతో రిలీజ్ అయిన తర్వాత ఇదే రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్నా క్రిస్టమస్ హాలిడేస్ లో కుమ్మేసే ఛాన్స్ ఎంతైనా ఉంది.