Home న్యూస్ ఏడాది తర్వాత వచ్చే సినిమాకి ఈ రేంజ్ రేటు ఏంటి సామి…నాని ఊచకోత!

ఏడాది తర్వాత వచ్చే సినిమాకి ఈ రేంజ్ రేటు ఏంటి సామి…నాని ఊచకోత!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో హాట్రిక్ విజయాలను నమోదు చేసి సంచలనం సృష్టించిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా తో రీసెంట్ గా వచ్చి మరోస్ సాలిడ్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని సంచలనం సృష్టించాడు….తన కెరీర్ లో సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ…

ఈ సినిమా రచ్చ లేపుతూ ఉండగా మరో పక్క వచ్చే ఏడాది నాని నుండి రాబోతున్న ది ప్యారడైజ్(TheParadise Glimpse) మూవీ మీద ఆల్ రెడీ సాలిడ్ గానే అంచనాలు ఏర్పడ్డాయి…దసరా కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే సమ్మర్ కానుకగా…

మార్చ్ 26న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆల్ రెడీ అంచనాలు ఓ రేంజ్ లో ఉండటం, నాని వరుసగా 4 హిట్స్ తో కెరీర్ బెస్ట్ ఫామ్ తో ఉండటంతో బిజినెస్ పరంగా ఆల్ రెడీ ఎక్స్ లెంట్ రేట్స్ ను ఈ సినిమా ఇప్పుడు సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తుంది.

అనిరుద్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియో రైట్స్ నాని కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ రేటుకి అమ్ముడు పోయి సంచలనం సృష్టించింది. సరిగమప మ్యూజిక్ కంపెనీ ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ కోసం ఆల్ మోస్ట్ 18 కోట్ల భారీ రేటుని చెల్లించి…

హక్కులను సొంతం చేసుకున్నారని తెలుస్తుంది…ఈ రేంజ్ లో రేటు సొంతం అవ్వడం అన్నది మామూలు విషయం కాదు. మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతున్న నాని ఏడాది తర్వాత వచ్చే సినిమాతో…

ఇప్పుడే ఈ రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా, ఆల్ రెడీ నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా సాలిడ్ రేటుని సొంతం చేసుకుందని అంటున్నారు…ఇక ఈ సినిమాతో నాని బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here