నాచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాగా తెరకెక్కిన సినిమా వి ది మూవీ, బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్ వలన రిలీజ్ ఆగి పోగా… భారీ గ్యాప్ తర్వాత మంచి రేటు ఆఫర్ రావడం తో డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకుని రీసెంట్ గా సినిమా రిలీజ్ ని సొంతం చేసుకుంది.
కాగా సినిమా ఒక సారి చూసే విధంగా ఉండగా సోషల్ మీడియా లో మాత్రం సినిమా పై నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వచ్చినా కానీ ఆడియన్స్ భారీ సంఖ్య లో సినిమాను అమెజాన్ ప్రైమ్ లో చూడగా లాక్ డౌన్ టైం లో హైయెస్ట్ వ్యూవర్ షిప్ ని…
సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా దూసుకు పోతున్న ఈ సినిమా ను ముందు నాని కోసం అనుకున్న కథ కాదని లేటెస్ట్ గా టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమా కథను ముందుగా 2 హీరోలకు వినిపించగా వాళ్ళు అన్న తర్వాత నాని దగ్గరకు వచ్చిందని అంటున్నారు.
ముందుగా ఈ కథని అల్లు అర్జున్ కి వినిపించారట డైరెక్టర్ కానీ కథ సింపుల్ రివేంజ్ డ్రామాగా ఉందని అల్లు అర్జున్ నో చెప్పి సాయి ధరం తేజ్ కి ఈ కథని సజేక్ట్ చేశారట. తర్వాత ఇంద్రగంటి సాయి ధరం తేజ్ కి ఈ కథ వినిపించగా తను కూడా నో చెప్పాడని సమాచారం. అదే టైం లో నాని కలవడం…
ఇలా ఒక అనుకుంటున్నానని, హీరో సైకో కిల్లర్ అని చెప్పడం తో నాని ఎక్సైట్ అయ్యి మొత్తం కథ వినకుండానే ఓకే చెప్పారని, అలా ఈ సినిమా నాని కెరీర్ లో 25 వ సినిమా గా వచ్చిందని అంటున్నారు. ఏది ఏమైనా మంచి వ్యూయర్ షిప్ తో OTT లో దూసుకు పోతుంది ఈ సినిమా.