Home గాసిప్స్ నాని వి స్టొరీ పాయింట్ ఇదే…నిజం అయితే మెంటల్ మాస్ ఖాయం!!

నాని వి స్టొరీ పాయింట్ ఇదే…నిజం అయితే మెంటల్ మాస్ ఖాయం!!

417
0

నాచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా గా తెరకెక్కిన సినిమా వి ది మూవీ…ప్రతిష్టాత్మక 25 వ సినిమా సోలో గా కాకుండా మల్టీ స్టారర్ గా అది కూడా కమర్షియల్ మూవీ కాకుండా ఓ భారీ ప్రయోగం నాని చేయడానికి కారణాలు ఏంటి అనేది సినిమా రిలీజ్ అయ్యాక తెలిసేది కానీ కరోనా ఎఫెక్ట్ వలన సమ్మర్ లో మొట్టమొదటి రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేకుండా పోయింది.

కాగా ఈ సినిమా కి సంభందించిన ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ లో సోషల్ మీడియా లో బాగా చక్కర్లు కొడుతుంది. ఆ న్యూస్ ప్రకారం సినిమా స్టొరీ లైన్… ఒక మిలటరీ ఆఫర్ కిల్లర్ గా మారతాడు, దానికి రీజన్ ఏంటి అనేది కథ పాయింట్ అంటున్నారు.

ట్విస్ట్ మీద ట్విస్ట్ తో సాగే సినిమా లో మరో భీభత్సమైన హైలెట్ ఉందని తెలుస్తుంది, అది ఇప్పుడు లీక్ చేయడం మంచిది కాదు కానీ ఇందులో కూడా పునర్జన్మల నేపధ్యంలో ఒక షాకింగ్ మైండ్ బ్లోయింగ్ సీక్వెన్స్ ఉంటుందని, అది ఇద్దరు హీరోల కి సంబంధించినది అని అంటున్నారు.

ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఎలిమెంట్స్ ఉన్నందుకే నాని ఈ సినిమా ను తన 25 వ సినిమా గా ఎంచుకున్నాడని సినిమా రిలీజ్ అయ్యాక నాని రేంజ్ మరింత పెరిగే సత్తా ఉన్న సినిమా ఇదని అంటున్నారు. నాని సుదీర్ బాబు ల పెర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుందని సినిమా అంతా ఒకెత్తు అయితే…

క్లైమాక్స్ ఇచ్చే ట్విస్ట్ మరో ఎత్తు అని, సీక్వెల్ కూడా ఉండే లెవల్ లో ఆ ట్విస్ట్ ఉంటుందని అంటున్నారు. ఈ లీక్స్ వింటుంటే సినిమా కచ్చితంగా మరో లెవల్ లో ఉండేలా ఉంది కానీ ఇప్పటికిప్పుడు థియేటర్స్ చూసే అవకాశమే లేదని చెప్పాలి. ఇలాంటి సినిమా ను డిజిటల్ లో కాకుండా థియేటర్స్ లోనే లేట్ అయినా రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here