ప్రస్తుతం టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడగా ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…
ఓపెనింగ్స్ పరంగా కూడా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉండగా, మరో పక్క బిజినెస్ పరంగా సినిమా నాని కెరీర్ లోనే ఆల్ టైం సెకెండ్ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని దంచికొట్టింది…. నార్మల్ కమర్షియల్ మూవీతో అయితే ఈ బిజినెస్ ను అందుకోడం…
పెద్ద కష్టం కాదు కానీ ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న వైలెంట్ మూవీ తో ఇలాంటి బిజినెస్ ను అందుకోవడం విశేషం కాగా ఓవరాల్ గా 48.9 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సాధించిన సినిమా 50 కోట్ల వాల్యూ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా..
రీసెంట్ టైంలో నాని నటించిన 5 సినిమాల టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఏకంగా 197 కోట్ల మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించడం విశేషం…. ఒకసారి నాని రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
#Nani Recent Movies Pre Release Business Details
👉#HIT3 Movie – 48.50CR********
👉#SaripodhaaSanivaaram – 41CR
👉#HiNanna – 27.60CR
👉#DASARA – 50CR
👉#AnteSundaraniki – 30CR
👉#ShyamSinghaRoy – 22CR
👉#GangLeader- 28Cr
👉#JERSEY – 26Cr
మొత్తం మీద నాని లాస్ట్ 5 సినిమాల టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క 197 కోట్ల మార్క్ ని అందుకోగా యావరేజ్ గా ఒక్కో సినిమా బిజినెస్ ఆల్ మోస్ట్ 39.40 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంటున్నాడు. టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలలో మోస్ట్ కన్సిస్టంట్ గా దుమ్ము లేపుతూ మాస్ రచ్చ చేస్తున్నాడు నాని…