Home న్యూస్ నాచురల్ స్టార్ @ 400 కోట్లు….ఒక్కరు కూడా దరిదాపుల్లో లేరు!!

నాచురల్ స్టార్ @ 400 కోట్లు….ఒక్కరు కూడా దరిదాపుల్లో లేరు!!

0

టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలలో ప్రస్తుతం హిట్స్ అందుకోవడమే కష్టం అయింది. టాక్ ఏమాత్రం తేడా కొట్టినా కూడా మీడియం రేంజ్ హీరోల సినిమాల రెవెన్యూ దారుణంగా పడిపోతూ ఉన్న టైంలో ఆడియన్స్ లో తన సినిమాల మీద మంచి క్రేజ్ ని ఎప్పటి కప్పుడు ఉండేలా చూసుకుంటూ కన్సిస్టంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర…

హిట్స్ తో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమాతో మరోసారి మాస్ రచ్చ చేశాడు….అంటే సుందరానికీ సినిమాతో డిసాస్టర్ కొట్టినా కూడా తర్వాత నుండి తన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ సాలిడ్ రెవెన్యూని దక్కించుకుంటూ ఉండగా…సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస విజయాలను కూడా నమోదు చేస్తూ ఇప్పుడు టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతున్నాడు నాని…

ఇప్పుడు నాని నటించిన లాస్ట్ 4 సినిమాల టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క ఏకంగా 400 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలు ఎవ్వరూ కూడా నాని దరిదాపుల్లో కూడా లేని రేంజ్ లో తన డామినేషన్ ని చూపెడుతూ దూసుకు పోతున్నాడు నాని…

నాని నటించిన దసరా మూవీ టోటల్ రన్ లో 115 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా తర్వాత చేసిన హాయ్ నాన్న మూవీ 74 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది. ఇక లాస్ట్ ఇయర్ చేసిన సరిపోదా శనివారం సినిమా టోటల్ రన్ లో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా…

Nani Hit3 Movie 8 Days Total WW Collections!!

మూడు సినిమాల టోటల్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క 289 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు వచ్చిన హిట్3 మూవీ ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 111 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా ఈ కలెక్షన్స్ తో ఇప్పుడు..

నాని నటించిన లాస్ట్ 4 సినిమాల టోటల్ గ్రాస్ లెక్క ఏకంగా 400 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించాడు….. ఇతర మీడియం రేంజ్ హీరోలు నానిని ఇప్పుడు అందుకోవాలి అంటే ఊహకందని రేంజ్ లో బ్లాక్ బస్టర్స్ ను వరుసగా సొంతం చేసుకుంటేనే ఆ ఛాన్స్ ఉంటుందని చెప్పాలి.

Nani Hit3 Movie 1st Week (7 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here