బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన క్రేజ్ ఉన్న సినిమాలు అన్నీ కూడా ఇక్కడ ఆశించిన మేర అయితే ఫలితాలను ఇవ్వలేక పోయాయి. దాంతో లాస్ట్ ఇయర్ సమ్మర్ తో పోల్చితే ఈ ఇయర్ సమ్మర్ మరింత నీరసంగా సాగుతూ ఉండగా మే 1 న బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie)….
మంచి అంచనాల నడుమ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో మంచి బజ్ ఉందని చెప్పాలి ఇప్పుడు. దాంతో బిజినెస్ పరంగా అన్ని మేజర్ ఏరియాల్లో మంచి బిజినెస్ లను సొంతం చేసుకుంటూ ఉండగా ఇప్పుడు రాయలసీమ ఏరియాలో..
ఈ సినిమా బిజినెస్ డీల్ క్లోజ్ అయింది. ఓవరాల్ గా రేటు భారీగానే సొంతం చేసుకున్నా రీసెంట్ నాని సినిమాలు ఇక్కడ బిజినెస్ లను దాటలేదు. దసరా మూవీ ఇక్కడ 6.50 కోట్ల బిజినెస్ కి 5.32 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. తర్వాత చేసిన మాస్ కమర్షియల్ మూవీ అయిన…
సరిపోదా శనివారం సినిమా 5 కోట్ల బిజినెస్ కి 4.04 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. కానీ బ్రేక్ ఈవెన్ ని అందుకోలేక పోయింది. అయినా కూడా ఇప్పుడు నాని నటించిన హిట్3 మూవీ ఎంత వైలేంట్ మూవీ నే అయినా కూడా ఎక్స్ పెరిమెంట్ సినిమా అవ్వడంతో..
బిజినెస్ సేఫ్ జోన్ లో జరుగుతుంది అనుకున్నా కూడా ఓవరాల్ గా రేటు మాత్రం 5.40 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకుంది ఇప్పుడు. సమ్మర్ లో పెద్దగా పోటి ఏమి లేదు కాబట్టి టాక్ బాగుంటే లాంగ్ రన్ లో టార్గెట్ ను అందుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా నాని చాలా గట్టిగానే కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.