ఈ ఇయర్ సమ్మోహనం సినిమాతో మంచి కంబ్యాక్ ని సొంతం చేసుకున్నా సుధీర్ బాబు హీరోగా మరియు నిర్మాతగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ నన్ను దోచుకుందువటే మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది.
కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకోగా మొత్తం మీద 8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది ఈ సినిమా. కానీ వీకెండ్ మొత్తం మీద సినిమా సాధించిన కలెక్షన్స్ షాకింగ్ గానే ఉన్నాయి.
టోటల్ గా రెండు రాష్ట్రాలలో 80 లక్షల షేర్ ని, రెండు రాష్ట్రాల ఆవల మొత్తం మీద 15 లక్షల షేర్ ని అందుకోగా టోటల్ గా సినిమా 95 లక్షల షేర్ ని మూడు రోజుల్లో సాధించింది. ఈ లెక్కన సినిమా టాక్ బాగున్నా బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపు అసాధ్యమే అని వీకెండ్ కలెక్షన్స్ చూస్తే తెలుస్తుంది. గురువారం దేవదాస్ భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ సినిమా కి అది మరింత అడ్డంకి అని చెప్పొచ్చు.