Home న్యూస్ నారప్ప గ్లిమ్స్ టాక్….రీమేక్ అయినా సస్పెన్స్ ఎందుకు?

నారప్ప గ్లిమ్స్ టాక్….రీమేక్ అయినా సస్పెన్స్ ఎందుకు?

749
0

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ లో చెరగని క్రేజ్ ని కంటిన్యు చేస్తున్న హీరో విక్టరీ వెంకటేష్, ఒకప్పుడు వరుస విజయాలతో దుమ్ము లేపిన తర్వాత కొద్దిగా స్లో డౌన్ అయినా కానీ రీసెంట్ గా మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర మల్టీ స్టారర్ మూవీస్ తో తన మ్యాజిక్ ని చూపుతూ మళ్ళీ సాలిడ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న వెంకటేష్ ఈ సారి బాక్స్ ఆఫీస్ దగ్గర సోలోగా మ్యాజిక్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు.

తమిళ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన ధనుష్ నటించిన అసురన్ సినిమాను తెలుగు లో నారప్ప పేరుతో రీమేక్ చేస్తుండగా ఇప్పటి వరకు క్లాస్ మూవీస్ ని డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల ఈ మాస్ మూవీ ని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే, అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటె సమ్మర్ కే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా…

కరోనా వలన పోస్ట్ పోన్ అవ్వగా రీసెంట్ గా తిరిగి మొదలు అయ్యింది, ఇక విక్టరీ వెంకటేష్ గారి పుట్టిన రోజు కానుకగా సినిమా గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు… కచ్చితంగా టీసర్ రేంజ్ లో ఉంటుంది అనుకుంటే కేవలం 26 సెకన్ల పాటు ఉన్న గ్లిమ్స్ లో వెంకీ పవర్ ఫుల్ సీన్స్ గ్లిమ్స్ ని చూపెట్టారు.

అవి మేస్మరైజింగ్ అనిపించే విధంగా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఒరిజినల్ దే వాడుకున్నారు. కానీ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ 80% కి పైగా అవ్వడంతో టీసర్ ను రిలీజ్ చేస్తారు అని అంతా భావించారు. ఆ విషయం లో కొద్దిగా నిరాశే ఎదురు అయ్యింది ఫ్యాన్స్… టీసర్ రిలీజ్ చేసి తెలుగు లో కొన్ని మార్పులతో… ఈ సినిమా ఉంటుంది అని చెబుతారు అని…

అంతా అంచనా వేశారు కానీ ఒరిజినల్ సీన్స్ నే మళ్ళీ దింపడంతో తమిళ్ ఆడియన్స్ మా సీన్స్ ని ఉన్నవి ఉన్నట్లు తీశారు అంటూ కామెంట్స్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు… రిలీజ్ వచ్చే సమ్మర్ అంటున్నారు కాబట్టి ఇప్పుడే టీసర్ వద్దని ఇలా చేశారని సమాచారం. గ్లిమ్స్ ని చూసి చాలా మంది సినిమా కథలో ఎలాంటి మార్పులు చేయలేదని ఫిక్స్ అయ్యారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here