తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన మూవీ అసురన్ అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా ఈ సినిమాను ఇప్పుడు తెలుగు లో విక్టరీ వెంకటేష్ నారప్ప పేరుతో రీమేక్ చేస్తున్నారు, అక్కడ రా రస్టిక్ నేపధ్యంలో ఉండే ఈ సినిమా ఇక్కడ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అన్నది ఆసక్తిగా ఉండగా తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా లేదా అని చూడటం జరిగింది, సినిమా ఎలా ఉందో ఇక్కడ వర్కౌట్ అవుతుందో లేదో తెలుసుకుందాం పదండీ…
ముందుగా స్టొరీ పాయింట్ కి వస్తే హీరో ధనుష్ పెద్ద కొడుకు కొన్ని కారణాల వల్ల ఊరి పెద్ద మనషి పై చేయి చేసుకుంటాడు…తర్వాత ఆ పెద్ద మనిషి ధనుష్ పెద్ద కొడుకుని చంపించగా తల్లి కొడుకుని కోల్పోయి తల్లడిస్తున్నా తండ్రి ఏం చేయకపోవడం చూసి చిన్న కొడుకు ఆ పెద్దమనిషిని నరికేస్తాడు..
తర్వాత ఆ కుటుంబం వాళ్ళు ధనుష్ కొడుకుని వెతకడం మొదలు పెట్టగా కొడుకుని ధనుష్ ఎలా కాపాడుకున్నారు అన్నది అసలు కథ. అసలు తండ్రి ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేసి సినిమా లో ఉపకథ… మొత్తం మీద సినిమా ధనుష్ నటనాప్రతిభను ఎవరైనా శెభాష్ చెప్పితీరాల్సిందే…తన యాక్టింగ్ కి ఎన్ని మార్కులు వేసినా తక్కువే…
సినిమాలో అప్ అండ్ డౌన్స్ చాలానే ఉన్నా, స్లో గానే స్టార్ట్ అయినా కొడుకు చనిపోయిన తర్వాత ఎమోషనల్ సీన్ నుండి సినిమా పుంజుకుంటుంది, ఇంటర్వెల్ లో చేతాకడు అనుకున్న తండ్రి అసురుడిగా మారి చిన్న కొడుకుని కాపాడటం, తర్వాత తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం. సెకెండ్ ఆఫ్ లో… తన వీరత్వం చూపే సీన్… తర్వాత క్లైమాక్స్ లో అదిరిపోయే ఫైట్ సీన్ సినిమా కి మెయిన్ హైలెట్స్…
నరేషన్ స్లో గా ఉండటం సినిమాకి ఒక డ్రా బ్యాక్ కాగా, మనం తెలుగు లో చూసిన రంగస్థలంని పోలి ఫస్టాఫ్ కథ ఉండటం ఇక్కడ కొంచం ఇబ్బంది పెట్టె అంశం, తెలుగు నేటివిటీ కి తగ్గ మార్పులు సినిమాలో తప్పక చేయాల్సి ఉంటుంది. ఓవరాల్ గా అసురన్ సినిమా ఒక మాస్టర్ పీస్ అనిపించే సినిమా…
సంగీతం సినిమాలో పెద్దగా లేకున్నా ఉన్న ఒక్క పాట పర్వాలేదు అనిపిస్తుంది, ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తుంది, ఫైట్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ మరో లెవల్ లో ఉంటుంది అని చెప్పాలి.
డైరెక్టర్ వెట్రీమారన్ డైరెక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే, ధనుష్ రోల్ ని ఎక్కడ ఎలివేట్ చేయాలో అక్కడ పెర్ఫార్మెన్స్ రాబట్టాలో అద్బుతంగా తెలిసిన డైరెక్టర్ తను… రీసెంట్ గా వాడా చెన్నై తో హిట్ కొట్టిన ఈ కాంబో లో ఇది వరకు కూడా 2 సినిమాలు వచ్చాయి. ఈ సినిమా తో ఇద్దరు కెరీర్ బెస్ట్ కొట్టారు..
తెలుగు లో విక్టరీ వెంకటేష్ నారప్ప పేరుతో చేస్తున్న ఈ సినిమా తండ్రి రోల్ వెంకీ కి ఎక్స్ లెంట్ గా సెట్ అవుతుంది, ఫ్లాష్ బ్యాక్ రోల్ ఎలా తీర్చిదిద్దుతారో చూడాలి. సినిమా తెలుగు నేటివిటీ కి తగ్గ మార్పులు పెర్ఫెక్ట్ గా చేస్తే ఒకప్పటి ధర్మచక్రం, గణేష్, జయం మనదేరా లాంటి వింటేజ్ వెంకీ ని మనం త్వరలో చూడొచ్చు…