ఓల్డ్ ఈజ్ ఆల్ వేస్ గోల్డ్ అని ఊరికే అనలేదు…. టాలీవుడ్ లో ప్రతీ వారం వచ్చే TRP రేటింగ్ లు మనం చూస్తూనే ఉన్నాం… అందులో కొత్త పాత అని తేడా లేకుండా అన్ని సినిమాలకు అప్పుడప్పుడు ఎక్కువ TRP రేటింగ్ లు వస్తుండగా అప్పుడప్పుడు ఓల్డ్ మూవీస్ కొత్త మూవీస్ ని కూడా డామినేట్ చేసే రేంజ్ లో TRP రేటింగ్ లను సొంతం చేసుకుని సంచలనం సృష్టిస్తున్నాయి.
లేటెస్ట్ గా ఇప్పుడు లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన సినిమాల్లో ఓ రెండు పాత సినిమాలు అల్టిమేట్ TRP రేటింగ్ ని సొంతం చేసుకుని కొత్త సినిమాలను కూడా డామినేట్ చేసే రేంజ్ లో సెన్సేషనల్ TRP రేటింగ్ లను సొంతం చేసుకుని దుమ్ము లేపాయి.
21 ఏళ్ల క్రితం వచ్చిన ఈ రెండు సినిమాలే రజినీకాంత్ నటించిన ఎపిక్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ నరసింహా అలాగే వెంకటేష్ నటించిన వన్ ఆఫ్ ఎపిక్ క్లాస్ మూవీ రాజా.. ఈ రెండు సినిమాలు లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయినప్పుడు అద్బుతమైన TRP రేటింగ్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేశాయి.
ముందుగా రజినీకాంత్ నరసింహా సినిమా అప్ డేటెడ్ HD వర్షన్ ని టెలికాస్ట్ చేసిన జెమినీ టీవీ లో క్వాలిటీ సాలిడ్ గా ఉండటం తో విరగబడి చూశారు జనాలు, దాంతో సినిమాకి ఏకంగా 7.68 TRP రేటింగ్ దక్కించుకుని దుమ్ము దుమారం చేసింది. ఇక వెంకటేష్ రాజా సినిమా ఎన్ని సార్లు టెలికాస్ట్ అయిందో అందరికీ తెలిసిందే.. అయినా కానీ రీసెంట్ గా టెలికాస్ట్ అయిన మరోసారి…
ఈ సినిమా కి కూడా 7.41 TRP రేటింగ్ దక్కించుకుని మిగిలిన సినిమాల కన్నా కూడా బెటర్ రేటింగ్ తో దుమ్ము లేపింది.. ఈ రెండు సినిమాలు ఆడియన్స్ ముందుకు 1999 లో రాగా 21 ఏళ్ల కి కూడా ఆడియన్స్ ని అలరించడం లో కొత్త సినిమాల కన్నా బెటర్ గా TRP రేటింగ్ ని రాబడుతుండటం విశేషం అనే చెప్పాలి…