టాలీవుడ్ కామెడీ మూవీస్ లో ఒక వెలుగు వెలిగిన హీరోల్లో అల్లరి నరేష్ కూడా ఒకరు, కెరీర్ లో ఆల్ టైం పీక్ స్టేజ్ ని ఎంజాయ్ చేశాక వరుస ఫ్లాఫ్స్ తో ఇప్పుడు ఫామ్ ని పూర్తిగా కోల్పోయాడు అల్లరి నరేష్. రీసెంట్ గా నాంది సినిమాతో ఎట్టకేలకు వరుస ఫ్లాఫ్స్ కి బ్రేక్ వేసి బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు… ఈ సినిమా టెలివిజన్ లో ఈ వీకెండ్ రాబోతుండగా….
రీసెంట్ గా ఒక వెబ్ ఇంటర్వ్యూ లో అల్లరి నరేష్ తన కెరీర్ ఇలా అవ్వడానికి ఒక రీజన్ ఓ బ్లాక్ బస్టర్ మూవీ అని అంటున్నాడు. ఆ మూవీ మరేదో కాదు టాలీవుడ్ లో కామెడీ మూవీస్ లో బిగ్గెస్ట్ క్రేజ్ తో భారీ లెవల్ లో రిలీజ్ అయ్యి….
అంచనాలను అందుకుని ప్రత్యెక తెలంగాణ పోరు టైం లో కూడా ఊహకందని విజయాన్ని నమోదు చేసిన సుడిగాడు సినిమా. ఈ సినిమా కన్నా ముందు అల్లరి నరేష్ సినిమాలు అంటే అవలీలగా 10 కోట్ల రేంజ్ షేర్ కన్ఫాం అని అంతా భావించే వారు, కానీ సుడిగాడు సినిమా ఆ లెక్కలు మార్చేసి….
ఏకంగా 22 కోట్ల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుని సంచలనం సృష్టించింది. దాంతో అల్లరి నరేష్ కి ఒకటి అర్ధం అయ్యిందట… సినిమా లో కామెడీ సీన్స్ ఎంత ఎక్కువ ఉంటె జనాలు అంతలా థియేటర్స్ కి వస్తారు అనుకుని కంటెంట్ ని పక్కకు పెట్టి కామెడీ సీన్స్ నే ఫోకస్ చేశానని, దాంతో ఏ సినిమా కూడా అంచనాలను అందుకోలేదని, తర్వాత అర్ధం అయిన విషయం కామెడీ కి కంటెంట్ తోడు అయితేనే సినిమా లు ఆడియన్స్ కి ఎక్కువ రీచ్ అవుతాయని అర్ధం అయిందని…
కానీ అప్పటికే జరగాల్సిన తప్పు జరిగి పోయిందని… అందుకే ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలనే చేయాలని ఫిక్స్ అయ్యాయని, అందులో భాగంగానే నాంది సినిమా చేశానని, ఆ కొత్త దనం ఆడియన్స్ కి నచ్చి ఎట్టకేలకు కంబ్యాక్ సొంతం అయ్యిందని, ఇక మీదట చేసే సినిమాల విషయం లో కూడా కంటెంట్ ఉంటేనే ఎంటర్ టైన్ మెంట్ గా చెప్పే కథలనే ఎంచుకుంటానని చెప్పుకొచ్చారు నరేష్…. మరి అప్ కమింగ్ మూవీస్ తో ఒకప్పటి లా జోరు చూపాలని మనమూ కోరుకుందాం…