బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతీ వారం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి కానీ ఈ వారం పెద్దగా అంచనాలు ఉన్న సినిమాలు ఏమి రిలీజ్ కాలేదు, ఉన్నంతలో చిన్న సినిమాలే రిలీజ్ అవ్వగా వాటిలో ఇండస్ట్రీలో పెద్ద హీరోలు ప్రమోట్ చేసిన సినిమా నాట్యం అని చెప్పాలి. ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు మెయిన్ రోల్ లో నటించి నిర్మించిన ఈ క్లాస్ మూవీ ఎలా ఉంది ఎంత వరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే… నాట్యానికి ప్రసిద్ధి చెందిన నాట్యం అనే ఊరిలో చిన్నప్పటి నుండే డాన్స్ నేర్చుకున్న హీరోయిన్ చిన్నప్పుడు కాదంబరి కథని ఇష్టపడి పెద్దయ్యాక ఆ కథని ఎలాగైనా తన కళతో అందరికీ తెలిసేలా చేయాలి అనుకుంటుంది… కానీ ఈ కథని ఆమె గురువు అడ్డు చెబుతాడు…తర్వాత తన లైఫ్ లో…
చోటు చేసుకున్న మార్పులు ఏంటి…ఆమె లైఫ్ లో రోహిత్ (రోహిత్ బెహల్) – హరి (కమల్ కామరాజు) పాత్ర ఏంటి లాంటివి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… కథ పరంగా పెద్దగా బలం లేకున్నా కానీ డాన్స్ మూమెంట్స్ కానీ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కానీ మెయిన్ హైలెట్ అని చెప్పాలి.
ఒకప్పుడు కే విశ్వనాథ్ క్లాసిక్ మూవీస్ ని తిరిగి కొంతవరకు గుర్తు చేస్తూ సాగిన నాట్యం పూర్తిగా అలాంటి జానర్ ఇష్టపడే వారికి పర్వాలేదు అనిపిస్తుంది కానీ కథలో బలం లేక పోవడం, స్క్రీన్ ప్లే చాలా నీరసంగా సాగడం, ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ చాలా స్లో నరేషన్ తో ఉండటం తో ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుందని చెప్పాలి.
భానుప్రియ, శుభలేఖ సుధాకర్, ఆదిత్య మీనన్ లాంటి సీనియర్లు నటించడంతో స్క్రీన్ పై స్టార్ కాస్ట్ బాగనే ఉన్న కథనం స్లోగా సాగడం, ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా సీన్స్ లేకపోవడం తో కష్టంగానే సినిమా ముగుస్తుంది. ఇలాంటి క్లాస్ డాన్స్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు సినిమా ని చూడొచ్చు… మంచి అటెంప్ట్ కానీ నేటి యూత్ ఆదరించడం కష్టం ఈ సినిమాని…