బాక్స్ ఆఫీస్ దగ్గర 2024 ఇయర్ ఫస్టాఫ్ మంచి స్టార్ట్ తర్వాత కంప్లీట్ గా ఫ్లాట్ గా మారిపోయింది…దాంతో సెకెండ్ ఆఫ్ పై భారీ ఆశలు ఉండగా ఫస్టాఫ్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు అలాగే సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ ను ముందే ప్లాన్ చేసుకున్న సినిమాల పోటితో ఇప్పుడు సెకెండ్ ఆఫ్ రిలీజ్ డేట్స్ క్లాష్ ఉండటం ఖాయంగా కనిపిస్తూ ఉండగా…
మరో పక్క అనౌన్స్ చేసిన డేట్స్ కన్నా ముందుకు లేదా వెనకకి కూడా కొన్ని రిలీజ్ డేట్స్ మారే అవకాశం ఉందని అంటూ ఉన్నారు…కాగా సెప్టెంబర్ ఎండ్ లో రిలీజ్ ను కన్ఫాం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన OG మూవీ ఇప్పుడు ఇయర్ ఎండ్ కి లేదా తర్వాత ఇయర్ కి వెళ్ళే అవకాశం ఉందని టాక్ గట్టిగా వినిపిస్తూ ఉండగా…
OG రావాల్సిన డేట్ అయిన సెప్టెంబర్ 27 కి ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర(Devara Part 1 Movie) రిలీజ్ ప్రీ పోన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్న టాక్ అయితే గట్టిగా వినిపిస్తూ ఉండగా త్వరలో దీనిపై మరింత క్లారిటీ రానుంది…
ఇక ఎన్టీఆర్ దేవర కనుక అక్టోబర్ 10 నుండి సెప్టెంబర్ 27కి ప్రీ పోన్ అయితే ఆ డేట్ కి నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటిస్తున్న లేటెస్ట్ అన్ టైటిల్ మూవీ NBK109 Movie రిలీజ్ అయ్యే అవకాశం ఉందని స్ట్రాంగ్ బజ్…ఎన్టీఆర్ దసరాకి రాకపోతే కచ్చితంగా బాలయ్య వచ్చే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు….
బాక్ టు బాక్ హిట్స్ తో కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న బాలయ్య లాస్ట్ ఇయర్ దసరాకి భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాతో మాస్ రచ్చ చేశాడు. దాంతో ఇప్పుడు మరోసారి అవకాశం వస్తే దసరాకే రావాలని చూస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమాల రిలీజ్ డేట్స్ పై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.