Home న్యూస్ నేను స్టూడెంట్ సర్…రివ్యూ-రేటింగ్!

నేను స్టూడెంట్ సర్…రివ్యూ-రేటింగ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ స్వాతిముత్యం అనే సినిమాతో తొలి సారి ఆడియన్స్ కి పరిచయం అయిన బెల్లంకొండ గణేష్ తొలి సినిమాతో పర్వాలేదు అనిపించినా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ ను అందుకోలేక పోయాడు. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు సమ్మర్ కానుకగా నేను స్టూడెంట్ సర్ అంటూ ఒక చిన్న ఎక్స్ పెరిమెంటల్ మూవీతో వచ్చేయగా ఈ సినిమాతో ఎంతవరకు మెప్పించాడో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…

ఎప్పటి నుండో ఫోన్ కొన్నుకోవాలి అని ఎదురు చూసి ఐఫోన్ 12 ని కొనుకుంటాడు, ఆ ఫోన్ కొన్నరోజే తన తన కాలేజ్ లో గొడవ వలన ఫోన్ ని కోల్పోవడంతో పోలిస్ కంప్లైంట్ ఇస్తాడు, ఆ తర్వాత తన లైఫ్ ఎలా టర్న్ అయింది. ఆ తర్వాత ఏం జరిగింది లాంటి విశేషాలను అన్నీ కూడా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… 

ఓవరాల్ గా సినిమాలో ఒక ఆసక్తి కరమైన ఎలిమెంట్ పాయింట్ ఉన్నప్పటికీ దానికి కవర్ అప్ గా వాడిన ఫోన్ కథ మాత్రం నిరాశపరుస్తుంది. సినిమా 2 గంటల లెంత్ ఉన్నప్పటికీ 2 సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది, ఫస్టాఫ్ కథ నత్తనడకన సాగగా ఇంటర్వెల్ కి అసలు పాయింట్ రివీల్ అవుతుంది…ఆ మధ్యలో కథ మొత్తం సహనానికి పరీక్ష పెడుతుంది.

ఇక సెకెండ్ ఆఫ్ లో కొంచం కథ పడుతూ లేస్తూ సాగి ఫస్టాఫ్ కన్నా బెటర్ గానే అనిపించినా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఏమంతగా మెప్పించలేక పోయింది ఈ సినిమా. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బెల్లంకొండ గణేష్ నటన పరంగా ఇంకా మెరుగు అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది… లుక్స్ ఓకే కానీ పెర్ఫార్మెన్స్ ఇంకా చాలా బెటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించగా…

సముద్రఖని రోల్ ఒక్కటి పర్వాలేదు అనిపిస్తుంది. సంగీతం యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరమ బోరింగ్ గా అనిపిస్తాయి. సినిమా లెంత్ ఇంకా చాలా తగ్గించాల్సి ఉండాల్సింది. ఇక సినిమాటోగ్రఫీ మెప్పించగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పిస్తాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే… ముందు చెప్పినట్లు కోర్ పాయింట్ బాగున్నా కానీ…

దాన్ని మలచిన తీరు నిరాశపరుస్తుంది. ఫస్టాఫ్ కంప్లీట్ గా ఫ్లాట్ నరేషన్ తో బోరింగ్ సీన్స్ తో సాగాయి, సెకెండ్ ఆఫ్ లో కొన్ని ఆసక్తికలిగించే ఎలిమెంట్స్ ఉన్నా అప్పటికే ఫస్టాఫ్ ను భరించిన ఆడియన్స్ సెకెండ్ ఆఫ్ ను కూడా అదే కోణంలో చూస్తాడు… ఓవరాల్ గా నేను స్టూడెంట్ సర్ సినిమా చూడాలి అంటే చాలా ఊపిక అవసరం, అలా ఓపికతో చూస్తె బోర్ ఫీల్ అయినా ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు. మొత్తం మీద సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here