Home న్యూస్ నేను మీకు బాగా కావాల్సినవాడిని రివ్యూ!!

నేను మీకు బాగా కావాల్సినవాడిని రివ్యూ!!

0

SR కళ్యాణ మండపంతో మంచి హిట్ కొట్టినా తర్వాత బాక్ టు బాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే సినిమాల తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ నేను మీకు బాగా కావాల్సిన వాడిని ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో ఒకే ఒక్క కమర్షియల్ అండ్ మాస్ టచ్ ఉన్న సినిమాగా రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది, ఎంతవరకు మెప్పించే ప్రయత్నం చేసిందో తెలుసుకుందాం పదండీ….ముందుగా కథ పాయింట్ కి వస్తే…

కాబ్ డ్రైవర్ అయిన హీరో సాఫ్ట్ వేర్ జాబ్ చేసే హీరోయిన్ ని పబ్ లో దింపాల్సి వస్తుంది, హీరోయిన్ పబ్ లో మందు కొడుతూ ఉండటంతో హీరో తన ప్రాబ్లం ఏంటి అని తెలుసుకుంటాడు, హీరోయిన్ ఫ్రాబ్లం ఏంటి, హీరో తర్వాత ఏం చేశాడు, ఇంతకీ హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

ఇంటర్వెల్ ఎపిసోడ్ అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ లు ఒకటి రెండు సాంగ్స్ మినహా సినిమా కంప్లీట్ గా ఆడియన్స్ అంచనాలను తగ్గట్లు ఎలాంటి కొత్తదనం లేకుండా సీన్ బై సీన్ వస్తూ వెళుతూ ఉంటుంది కానీ ఆడియన్స్ అసలు ఆ సీన్స్ కి మినిమమ్ కనెక్ట్ అవ్వలేరు, ఉన్నంతలో హీరో కిరణ్ అబ్బవరం బాగానే నటించి మెప్పించగా హీరోయిజం సీన్స్ లో కూడా ఆకట్టుకున్నాడు, డాన్సులు కూడా బాగానే చేశాడు, హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించుకోగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు….

సినిమాలో కథ చాలా రొటీన్ గా ఉండటంతో స్క్రీన్ ప్లే అయినా ఆసక్తిగా ఉంటందేమో అనుకుంటే కొన్ని సీన్స్ మినహా స్క్రీన్ ప్లే కూడా సహనానికి పరీక్ష పెడుతుంది. సినిమాటోగ్రఫీ మెప్పించగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆకట్టుకున్నాయి. ఓవరాల్ కథ కోర్ పాయింట్ తరుణ్ జెనీలియాల శశిరేఖ పరిణయం నుండి తీసుకున్నట్లు అనిపించగా బ్యాగ్ డ్రాప్ మార్చారు…

మొత్తం మీద ఫక్తు మాస్ కమర్షియల్ రొటీన్ మూవీ గా ఉన్న నేను మీకు బాగా కావాల్సినవాడిని రెగ్యులర్ మూవీ లవర్స్ కొంచం ఓపికతో చూస్తె పర్వాలేదు అనిపించవచ్చు, రీసెంట్ టైం లో డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చూసిన తర్వాత వాటితో ఈ సినిమాను కంపేర్ చేస్తే మట్టుకు భారీగా నిరాశ కలగక మానదు…. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here