బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ టైం లో మొదలైన టికెట్ రేట్ల సమస్య ఆల్ మోస్ట్ 11 నెలల పాటు కొనసాగగా ఎట్టకేలకు రీసెంట్ గా కొత్త జీవో ప్రకారం సినిమాల టికెట్ రేట్స్ ని ఆంధ్ర లో పెంచుతున్నట్లు అనౌన్స్ చేశారు ప్రభుత్వం వాళ్ళు… కానీ ఇదే టైం లో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కి ముందే రావాల్సిన ఈ జీవో ని ఆ సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో అయ్యే వరకు ఎదురు చూసి సెకెండ్ వీకెండ్ అయ్యాక రిలీజ్ చేశారు… దాంతో అప్పటికే టికెట్ హైక్స్ లేక ఆంధ్రలో ఎదురు దెబ్బ ఫేస్ చేసిన భీమ్లా నాయక్ సినిమా కి టికెట్ హైక్స్ జీవో వచ్చిన తర్వాత అయినా అడ్వాంటేజ్ ఏమైనా లభించిందా…
అంటే లేదనే చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే కొత్త జీవో రిలీజ్ అయ్యే టైం కి భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అవ్వగా సినిమా కి ఈ టికెట్ హైక్స్ ఆంధ్ర లో మిగిలిన సినిమాలతో సమానంగా పెంచాల్సి ఉంటుంది కానీ చాలా సెంటర్స్ లో మాత్రం భీమ్లా నాయక్…
సినిమా కి టికెట్ రేట్స్ జీవో రాక ముందు ఎంత ఉన్నాయో అదే రేటు తో ఉంచారని తెలుస్తుంది. కొత్త రిలీజ్ లు సూర్య ఈటీ మరియు ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలకు టికెట్ హైక్స్ ఉండగా వాటితో పాటు ఇప్పుడు మూడో వారంలో అడుగు పెట్టిన భీమ్లా నాయక్ కి చాలా సెంటర్స్ లో పాత రేట్లే ఉండటం ఆశ్యర్యానికి గురి చేస్తూ ఉండగా…..
సినిమా స్లో అవ్వడం తో ఇప్పుడు టికెట్ హైక్స్ చేస్తే మరింత డ్రాప్ అయ్యే అవకాశం ఉందని ఈ టికెట్ హైక్స్ పెట్టలేదని అంటున్నా కానీ వీకెండ్ కి కూడా ఇప్పుడు పాత రేట్లే కొనసాగే అవకాశం ఉండేలా ఉండటం తో కొత్త జీవో రిలీజ్ తర్వాత కూడా భీమ్లా నాయక్ కి ఎదురుదెబ్బే తగిలింది అని అంటున్నారు విశ్లేషకులు….