ముందుగా కథ విషయానికి వస్తే…ఊర్లో వ్యవసాయం చేసుకునే హీరో కి రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలి అని కోరిక ఉంటుంది, కానీ మొదట్లో అనేక అవరోధాలను ఎదురుకున్న హీరో తర్వాత రూట్ మార్చి చక చకా రాజకీయాల్లో ఉన్నత స్థానానికి వెళతాడు. తర్వాత ఎం జరిగింది అన్నది అసలు కథ.
కథ ఎలా ఉన్నా సూర్య మాత్రం తన పాత్ర వరకు ఎంత కావాలో అంతకంటే ఎక్కువే చేశాడు కానీ కథలో సత్తా లేకపోవడం తో అది వృధా అయింది, హీరోయిన్స్ లో సాయి పల్లవి కి కొంచం నటించే చాన్స్ దొరకగా రకుల్ అప్పుడప్పుడు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. మిగిలిన నటీనటులు ఎవరు పెద్దగా రిజిస్టర్ అవ్వరు.
సంగీతం వీక్ గా ఉన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో మాత్రం యువన్ శంకర్ రాజా సత్తా చాటుకున్నాడు, ఎడిటింగ్ చాలా వీక్ గా ఉంది, ఇక డైరెక్షన్ అయితే చాలా వీక్ గా ఉంది, సెల్వ రాఘవన్ డైరెక్షన్ పరంగా ఘోరంగా విఫలం అయ్యాడు అనిపిస్తుంది. చాలా సీన్స్ తేలిపోయాయి. ఫస్టాఫ్ కొంచం బరించే విధంగా ఉన్నా సెకెండ్ ఆఫ్ మాత్రం బరించడం కష్టమే.
ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ని గమనిస్తే
*సూర్య
*క్లైమాక్స్ స్పీచ్
మైనస్ పాయింట్స్
*కథ
*డైరెక్షన్
*ఎడిటింగ్
*సెకెండ్ ఆఫ్ ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే ఉన్నాయి…
మొత్తం మీద సూర్య సినిమాను సేవ్ చేద్దామని ఎంత ట్రై చేసినా దర్శకుడు ఆ చాన్స్ ఇవ్వలేదు.. సూర్య కోసం సినిమాను ఒకసారి చూడొచ్చు… సినిమాకి మా ఫైనల్ రేటింగ్ 2.25 స్టార్స్…