Home న్యూస్ వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు…ఈ కటౌట్ ఎన్ని అడుగులో తెలిస్తే మైండ్ బ్లాంక్!!

వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు…ఈ కటౌట్ ఎన్ని అడుగులో తెలిస్తే మైండ్ బ్లాంక్!!

747
0

  స్టార్ హీరోల రికార్డులలో చాలా రకాలు చేరాయి… ఫస్ట్ డే కలెక్షన్స్, లాంగ్ రన్ కలెక్షన్స్, టీసర్ ట్రైలర్ రికార్డులు ఇలా అనేక రికార్డుల తర్వాత ఇప్పుడు మరో కొత్త రికార్డ్ చేరింది, మన ఇండస్ట్రీ దాకా ఇది ఇంకా ఫుల్ ఫ్లెట్చుడ్ గా పాకలేదు కానీ కోలివుడ్ లో కొంచం మితిమీరి పోతుంది అని చెప్పొచ్చు. విజయ్, రజినీ అజిత్ ఫ్యాన్స్ తమ హీరోల కటౌట్ సైజ్ ఓ రేంజ్ లో పెంచుతూ మాదే రికార్డ్ అంటూ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నారు.

విజయ్ సర్కార్ సమయంలో అజిత్ విశ్వాసం టైం లో ఫ్యాన్స్ ఇలా భారీ కటౌట్స్ ని పెట్టి తమ అభిమానాన్ని చాటుకోవడమే కాకుండా హైయెస్ట్ సైజ్ ఉన్న కటౌట్స్ సో సోషల్ మీడియా లో కూడా తమ ఫ్యానిజం చూపుకున్నారు. ఇక ఇప్పుడు సూర్య ఫ్యాన్స్ అయితే మరో మెట్టు ఎక్కేసి ఆల్ టైం రికార్డ్ కొట్టేసారు.

సూర్య లేటెస్ట్ మూవీ NGK రిలీజ్ కానుండటం తో ఏకంగా 215 అడుగుల కటౌట్ ని సిద్ధం చేసి ఇప్పటి వరకు ఏ హీరో ఫ్యాన్స్ సాధించలేనంత పొడవు కటౌట్ ని సిద్ధం చేసి సంచలనం సృష్టించారు. దాంతో సినిమా పై ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సినిమా ఇదే రేంజ్ లో కుమ్ముతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here