ఆల్ మోస్ట్ మూడేళ్ళుగా తెరకెక్కుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ కోసం ఆల్ ఇండియా ఇప్పుడు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు సినిమాను ఎంతో కష్ట పడి అన్ని చోట్లా అద్బుతమైన రీతిలో రాజమౌళి తో కలిసి ప్రమోట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉండగా తెలుగు రాష్ట్రాలలో సినిమా పై…
నెక్స్ట్ లెవల్ ఎక్స్ పెర్టేషన్స్ ఏర్పడగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కచ్చితంగా దుమ్ము దులపడం ఖాయమని అంతా నమ్ముతున్నారు. కానీ అందరికీ ఇప్పుడు మెల్లిమెల్లిగా ఎక్కడో తెలియని భయం మొదలు అయింది. దానికి కారణాలు వేరే ఏమి లేవు…. మరో వేవ్ కి సిద్ధం అవుతున్న కరోనా వలనే అని చెప్పాలి.
ఈ ఇయర్ సెకెండ్ వేవ్ కొట్టిన దెబ్బ నుండి కోరుకుని మళ్ళీ వరుస పెట్టి సినిమాల రిలీజ్ లు ప్లాన్ చేస్తూ ఉండగా ఓమిక్రాన్ వేరియేంట్ కేసులు పెరిగుతూ ఉండటం తో దేశంలో పలు రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూని పెట్టారు. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, UP, గుజరాజ్, రాజస్థాన్, హర్యానా ఇలా స్టేట్స్ కౌంట్ పెరుగుతూ ఉండగా…
ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ టైం కి ఇది పెద్ద ఎదురుదెబ్బ అయ్యేలా ఉందని చెప్పాలి. నైట్ కర్ఫ్యూలు సాయంత్రం 7:30 నుండే మొదలు అవుతాయి అంటున్నారు కాబట్టి ఆ టైం కన్నా ముందే థియేటర్స్ షోలు పూర్తీ అయ్యి ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి నైట్ షోలకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. దాంతో కలెక్షన్స్ పై ఈ ఇంపాక్ట్…
చాలా గట్టిగానే ఉండేలా ఉందని చెప్పాలి. దాంతో ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ పోన్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి కానీ ప్రస్తుతానికి అయితే అలాంటివి ఏమి లేవనే చెప్పాలి. కలెక్షన్స్ పరంగా దెబ్బ పడేలానే ఉన్నప్పటికీ పోస్ట్ పోన్ లు అయితే ఉండవనే చెప్పాలి. మరి రిలీజ్ టైం నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి ఇక.