హ్యాపీడేస్ సినిమాతో కెరీర్ ని మొదలు పెట్టి, యువత సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకున్ని ఎనర్జీ పరంగా జూనియర్ రవితేజ అంటూ గుర్తింపు ని కూడా తెచ్చుకున్న నిఖిల్ సిద్దార్థ్ మంచి పేరుని సొంతం చేసుకున్నా తర్వాత వరుస పెట్టి ఫ్లాఫ్స్ తో వచ్చిన క్రేజ్ ని పోగొట్టుకున్నాడు. కానీ స్వామి రారా, కార్తికేయ మరియు ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలతో బాక్ టు బాక్ హిట్స్ కొట్టి ఆడియన్స్ లో…
తిరిగి తన పై నమ్మకాన్ని పెంచేలా చేసుకున్న నిఖిల్ తర్వాత మధ్య మధ్యలో కొన్ని యావరేజ్ సినిమాలు పడ్డగా అర్జున్ సురవరం సినిమాతో లాస్ట్ హిట్ కొట్టి అప్పటి నుండి వరుస పెట్టి కొత్త సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న టైం లో ఫస్ట్ వేవ్ అండ్ ఇప్పుడు…
సెకెండ్ వేవ్ వలన తన అప్ కమింగ్ సినిమాలకు ఇబ్బందులు ఎదురు అవ్వగా ఇప్పుడు ఆల్ మోస్ట్ ఫినిష్ స్టేజ్ లో ఉన్న సినిమాగా సుకుమార్ కథ అందించి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన కొత్త సినిమా 18 పేజెస్ కొత్త కాన్సెప్ట్ పోస్టర్స్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సినిమా పై…
మరింత ఆసక్తిని పెంచేలా చేయగా సినిమా పరిస్థితులు అన్నీ నార్మల్ అయ్యాక సెకెండ్ ఆఫ్ లో ఆడియన్స్ ముందుకు వస్తుంది అనుకున్నా ఇప్పుడు పరిస్థితులు నార్మల్ అయ్యాక పోటి తీవ్రంగా ఉంటుంది కాబట్టి సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయాలనీ ఆలోచిస్తున్నారట. అందుకు గాను డైరెక్ట్ రిలీజ్ కి ఆఫర్స్ కూడా గట్టిగానే వస్తుండగా లేటెస్ట్ గా సినిమాకి…
18-20 కోట్ల రేంజ్ లో డైరెక్ట్ రిలీజ్ ఆఫర్స్ ఈ సినిమా కోసం వస్తున్నాయని సమాచారం. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినా ఈ రేంజ్ జరగడం కష్టమే కాబట్టి ఈ రేంజ్ ఆఫర్ కి మేకర్స్ ఇప్పుడు ఓకే చెప్పాలా వద్ద అన్న ఆలోచనలో ఉన్నారట, ఆహా యాప్ లో కూడా రిలీజ్ చేసే ఆలోచన లో ఉండటం కూడా నిర్ణయం వెంటనే తీసుకోకుండా ఉండటానికి కారణం అంటున్నారు. మరి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.