Home గాసిప్స్ 7 కోట్లు ఔట్….తెలిసి మరీ తప్పు చేశారేంటి!!

7 కోట్లు ఔట్….తెలిసి మరీ తప్పు చేశారేంటి!!

504
0

లేడీ ఓరియెంటెడ్ మూవీస్ స్పెషలిస్ట్ అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ నిశ్శబ్దం… ఎప్పుడో పూర్తీ అయిన ఈ సినిమా ఈ ఇయర్ మొదట్లో నుండి ఆడియన్స్ ముందుకు రావడానికి ట్రై చేసింది కానీ డేట్ దొరకక, పరిస్థితులు కలిసి రాకా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది, సమ్మర్ రేసులో నిలుస్తుంది అనుకుంటే సడెన్ గా కరోనా ఎంటర్ అవ్వడం తో ఇక సినిమా పరిస్థితి ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో నిలిచింది.

అప్పట్లో మంచి OTT ఆఫర్లు వచ్చినప్పటికీ మేకర్స్ మాత్రం నో చెబుతూ రాగా ఈ లోపు సినిమా పై ఉన్న బజ్ మొత్తం పోయింది, దాంతో ఏ ఆఫర్ వస్తే దానికి ఓకే చెబుతాం అని ఎదురు చూస్తున్న టైం లో… రేట్లు తగ్గించి ఆఫర్లు ఇవ్వగా ఉన్నంతలో…

అమెజాన్ ప్రైమ్ వాళ్ళు సినిమా కి 23 కోట్ల రేటు చెల్లించి డిజిటల్ రైట్స్ హక్కులను సొంతం చేసుకున్నారు. కానీ ఇక్కడే యూనిక్ కి షాక్ తగిలింది, ఆ రేటు కి ఇవ్వాలి అంటే సినిమా కంప్లీట్ హక్కులను ఇవ్వాలని కండీషన్ పెట్టారు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు… అంటే ఛానెల్స్ కి కానీ డబ్బింగ్ రైట్స్ కి గానీ అమ్ముకోవడం కుదరదు…

ఆ కండీషన్ తోనే యూనిట్ కి 23 కోట్ల రేటు వెళ్ళింది అని సమాచారం… ఇక సినిమా కి అయిన ఓవరాల్ బడ్జెట్ 30 కోట్లు కాగా సినిమా మొత్తం మీద చేసిన బిజినెస్ 23 కోట్లు మాత్రమే… అంటే 7 కోట్ల నష్టం సొంతం చేసుకున్న ఈ సినిమా ను మరే విధంగా ఇప్పుడు బిజినెస్ చేసుకోలేరు….

హిందీ వర్షన్ ఉంది కానీ అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వేరే ఉన్నారు… అందుకే కేవలం సౌత్ భాషల డీల్ మాత్రమె జరిగింది. మొత్తం మీద ముందు రిలీజ్ చేసి ఉంటె రేటు కొంచం అటూ ఇటూ అయినా శాటిలైట్ రైట్స్ తో సేఫ్ అయ్యే వాళ్ళు కానీ ఇప్పుడు తెలిసి తెలిసి 7 కోట్ల నష్టంతో సినిమాను అమ్మేయాల్సి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here