బాక్స్ ఆఫీస్ దగ్గర 2020 టైంలో భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా తర్వాత వరుసగా 4 ఫ్లాఫ్ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా స్లో డౌన్ అయిన యూత్ స్టార్ నితిన్(Nithiin) నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) సినిమాతో ఇప్పుడు తిరిగి భీష్మ రిజల్ట్ ను రిపీట్ చేయాలనీ చూస్తూ ఉండగా….
రాబిన్ హుడ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా నితిన్ కెరీర్ లోనే సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి. ఆల్ మోస్ట్ 27.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుని…
మాస్ కుమ్ముడు కుమ్మేసిన ఈ సినిమా రీసెంట్ టైంలో నితిన్ కెరీర్ లో బెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. అలాగే వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా నితిన్ లాస్ట్ 5 సినిమాల టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఏకంగా 113 కోట్ల దాకా ఉండటం విశేషం అని చెప్పాలి.
ఒకసారి నితిన్ నటించిన రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
#Nithiin Recent Movies Pre Release Business Details
👉#RobinHood – 27.50CR******
👉#ExtraOrdinaryMan – 24.20CR
👉#MacherlaNiyojakavargam – 21.20CR
👉#RangDe – 23.90CR
👉#Check – 16Cr
👉#Bheeshma – 21.80Cr
👉#SrinivasaKalyanam – 25.80CR
మొత్తం మీద నితిన్ లాస్ట్ 5 సినిమాల టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఆల్ మోస్ట్ 113 కోట్ల రేంజ్ లో ఉండగా యావరేజ్ గా ఒక్కో సినిమా కి 22.6 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న నితిన్…
వరుస ఫ్లాఫ్స్ లో కూడా బిజినెస్ పరంగా కన్సిస్టంట్ గా ఉండటం విశేషం అని చెప్పాలి… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర భీష్మ తర్వాత మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ కి రాబిన్ హుడ్ మూవీ ఎలాంటి రిజల్ట్ ను ఇప్పుడు సొంతం అయ్యేలా చేస్తుందో చూడాలి.