Home గాసిప్స్ నితిన్ 90 కోట్ల సినిమా…ఎప్పుడు స్టార్ట్ అంటే!!

నితిన్ 90 కోట్ల సినిమా…ఎప్పుడు స్టార్ట్ అంటే!!

415
0

వరుస మూవీస్ తో జోరు చూపబోతున్నాడు నితిన్… బాక్స్ ఆఫీస్ దగ్గర అ ఆ సినిమా తర్వాత సరైన హిట్ పడని నితిన్ చాలా ప్రయోగాలు చేసినప్పటికీ అనుకున్న విజయం దక్కలేదు. ఇలాంటి టైం లో ఛలో డైరెక్టర్ వెంకి కొడుముల డైరెక్షన్ లో చేసిన భీష్మ సినిమా తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన నితిన్ ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్నాడు.

ఇక ఇప్పుడు వరుస సినిమాలను కమిట్ అవుతూ దూసుకు పోతున్నాడు. ముందుగా బాలెన్స్ ఉన్న రంగ్ దే సినిమా షూటింగ్ ని ఫినిష్ చేస్తున్న నితిన్ ఈ సినిమా తో పాటు చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో చేస్తున్న డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ చెక్ ని రీసెంట్ గా…

టైటిల్ ని కన్ఫాం చేయగా ఇప్పుడు ఈ సినిమా తో పాటు తన కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ గా చెప్పుకుంటున్న కొత్త అప్ కమింగ్ మూవీ ని కూడా వచ్చే ఇయర్ ఫిబ్రవరి నుండి మొదలు పెట్టబోతున్నారని సమాచారం. చల్ మోహన్ రంగ తో నితిన్ కి అనుకున్న విజయాన్ని ఇవ్వలేక పోయిన….

చైతన్య కృష్ణ డైరెక్షన్ లో 90 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో రూపొందబోతున్న పవర్ పేట సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇన్ని రోజులు కొనసాగిందట. మరి కొన్ని రోజుల్లో వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుందని సమాచారం. దాంతో సినిమా ను వచ్చే ఇయర్ ఫిబ్రవరి లో మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది.

ఈ సినిమా లు మూడు డిఫెరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు నితిన్… ఈ సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ అని చెప్పిన నితిన్ సినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. 2 పార్టులుగా రూపొందబోతున్న ఈ సినిమా నితిన్ మార్కెట్ ని ఎంతవరకు పెంచుతుందో అన్నది ఆసక్తిగా మార్చింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here