Home గాసిప్స్ షాకింగ్: బ్లాక్ బస్టర్ రీమేక్ కోసం ఇన్ని కోట్లు ఏంటి సామి!!

షాకింగ్: బ్లాక్ బస్టర్ రీమేక్ కోసం ఇన్ని కోట్లు ఏంటి సామి!!

595
0

    యూత్ స్టార్ నితిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అ.ఆ సూపర్ డూపర్ హిట్ తర్వాత ఫ్లాఫ్స్ గట్టిగానే ఎదురుకోగా ఎట్టకేలకు ఈ ఏడాది భీష్మ సినిమా తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడు అయిన ఈ కొత్త పెళ్లి కొడుకు త్వరలోనే మళ్ళీ సినిమాలతో బిజీ కాబోతున్నాడు. ముందుగా ఫైనల్ స్టేజ్ లో ఉన్న రంగ్ దే ని…

కంప్లీట్ చేయబోతుండగా…. ఆ తర్వాత బాలీవుడ్ లో రెండేళ్ళ క్రితం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధదూన్ సినిమాను తెలుగు లో రీమేక్ చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాను వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా…

కృష్ణార్జున యుద్ధం సినిమాలు తీసిన డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో చేయబోతుండగా ఈ సినిమా కోసం రీసెంట్ గా హీరోయిన్ గా నటించడానికి పూజా హెడ్గే కి 2 కోట్లు ఆఫర్ చేశారట, కానీ చాలా మూవీస్ కమిట్ అవ్వడం వలన నో చెప్పగా… తబు రోల్ కి గాను ఇక్కడ…

రమ్యక్రిష్ణ, శిల్పాశెట్టి, అనసూయ లాంటి పేర్లు వినిపించినా నయనతార ని అప్రోచ్ అవ్వగా నయనతార ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేసిందట. యూనిట్ 4 కోట్ల కి ఓకే అన్నారని టాక్ ఉండగా నయనతార నిర్ణయం ఇంకా తెలియాల్సి ఉందని అంటున్నారు. హీరోయిన్ అండ్ కీలక రోల్స్ కోసమే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇస్తూ ఉండగా ఇక సినిమా కి ఓవరాల్ గా అనుకుంటున్న బడ్జెట్…

ఏకంగా 40 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంటున్నారు… ఈ రేంజ్ బడ్జెట్ అంటే రిస్క్ అనే చెప్పాలి.. అందునా సినిమా కాన్సెప్ట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ కాదు… హీరో గుడ్డివాడిలా కనిపిస్తాడు, చాలా డిఫెరెంట్ గా సినిమా ఉంటుంది, మరి ఈ రేంజ్ బడ్జెట్ తో సినిమా తెలుగు లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here