Home గాసిప్స్ సెన్సేషనల్ సినిమా చేయనున్న నితిన్…కెరీర్ టర్నింగ్ పాయింట్ పక్కా!!

సెన్సేషనల్ సినిమా చేయనున్న నితిన్…కెరీర్ టర్నింగ్ పాయింట్ పక్కా!!

0

   యూత్ స్టార్ నితిన్ కెరీర్ లో రీసెంట్ గా వచ్చిన ఫ్లాఫ్స్ తర్వాత భీష్మ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే, అన్ సీజన్ లో కూడా సాలిడ్ విజయాన్ని నమోదు చేసింది ఈ సినిమా. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ చేయబోయే అప్ కమింగ్ సినిమాలు కూడా సాలిడ్ ఉన్నాయని చెప్పొచ్చు. రీసెంట్ గా నితిన్ సినిమాలు యూట్యూబ్ లో రికార్డ్ కొట్టిన విషయం తెలిసిందే..

ఇక తన అప్ కమింగ్ సినిమాల విషయం లో క్రేజీ సినిమాలను కమిట్ అయ్యాడు, ముందుగా ఇప్పుడు రంగ్ దే సినిమా తో రాబోతున్న నితిన్ ఈ సినిమా తర్వాత బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అంధాధూన్ సినిమా ను తెలుగు రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే.

Bheeshma 10 Days Total WW Collections

ఇక ఈ సినిమా తర్వాత అసలు సిసలు సాలిడ్ సినిమా ను సెట్ చేశాడు, తనతో ఇది వరకు చల్ మోహన్ రంగ సినిమా ను తెరకెక్కించిన చైతన్య డైరెక్షన్ లో ఓ రా రస్టిక్ కథ తో “పవర్ పేట” అనే మూవీ ని తెరకెక్కించబోతున్నారు, ఇది తన ఓన్ బ్యానర్ తో పాటు పీపుల్స్ మీడియా…

Bheeshma 20 Days Total WW Collections

కూడా కలిసి నిర్మించబోతున్నారు, ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్క బోతుందని సమాచారం….కాగా భారీ బడ్జెట్ తో రూపొందబోతున్న ఈ సినిమా లో నితిన్ రోల్ అద్బుతంగా ఉంటుందని సమాచారం. కోలివుడ్ లో ధనుష్ నటించిన వడా చెన్నై సినిమా తరహా కథాంశం తో తెరకెక్కుతుందని అంటున్నారు.

ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతుందట. ఈ సినిమాలు అన్నీ అనుకున్నట్లు తెరకెక్కితే బాక్స్ ఆఫీస్ దగ్గర నితిన్ కి ఇది బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది, ఇది వరకు కూడా లై లాంటి ప్రస్టీజియస్ మూవీ తో ట్రై చేసినా ఫలితం బెటర్ గా రాలేదు, ఈ సారి అన్నీ అనుకున్నట్లు జరిగితే నితిన్ కచ్చితంగా తన రేంజ్ ని భారీ గా పెంచుకోవడం ఖాయం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here