కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలను అందుకుని తర్వాత హిట్స్ కి చాలా కాలం దూరం అయ్యి తిరిగి ఇష్క్ మూవీ తో కంబ్యాక్ ని గట్టిగా ఇచ్చిన నితిన్ వెంటనే గుండెజారి గల్లంతైందే సినిమాతో బ్లాక్ బస్టర్ ను హార్ట్ అటాక్, చిన్నదానా నీకోసం తో పర్వాలేదు అనిపించుకున్నాడు బాక్స్ ఆఫీస్ దగ్గర, కానీ తర్వాత వరుస పెట్టి ఫ్లాఫ్స్ వెక్క్రిరించగా ఎట్టకేలకి లాస్ట్ ఇయర్ భీష్మ సినిమా తో…
సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకున్నాడు, కానీ మళ్ళీ వరుస పెట్టి చెక్ మరియు రంగ్ దే సినిమాలతో బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ నితిన్ సొంతం అవ్వగా ఇలాంటి టైం లో ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం నెలకొన్న నేపధ్యంలో…
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ అంధధూన్ తెలుగు రీమేక్ మేస్ట్రో తో ఆడియన్స్ ముందుకు ఈ పాటికే రావాల్సింది కానీ సెకెండ్ వేవ్ వలన కుదరలేదు కానీ సినిమా షూటింగ్ ను రీసెంట్ గా కంప్లీట్ చేశారు. కాగా సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకునే అవకాశం…
ఎక్కువగా ఉందని తెలుస్తుంది. రీసెంట్ గా సినిమా డిజిటల్ రైట్స్ కింద 30 కోట్ల మేర ఆఫర్స్ వచ్చాయి. రీసెంట్ గా జీ 5 వాళ్ళు ఈ సినిమా హక్కుల కోసం 32 కోట్ల మేర రేటు ని కోట్ చేశారని టాలీవుడ్ లో టాక్ ఉంది. కానీ అది సినిమా ఓన్లీ డిజిటల్ రైట్స్ కే లేక ఇతర సినిమాల మాదిరి టోటల్ రైట్స్ అన్నది ఇంకా…
క్లారిటీ రావాల్సి ఉంది. టోటల్ రైట్స్ అంటే ఈ రేటు ఏమాత్రం ఓకే కాదు కాబట్టి డిజిటల్ రైట్స్ కే అని అంటున్నారు. ఇక సినిమా డిజిటల్ రిలీజ్ ఆల్ మోస్ట్ కన్ఫామే అన్న వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అఫీషియల్ అప్ డేట్ ఉండే అవకాశం ఉంది. మరి ఈ సినిమా తో నితిన్ ఎంతవరకు అంచనాలను అందుకుంటాడో చూడాలి.