టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం ఇండియా మొత్తం మీద కరోనా పరిస్థితులను తట్టుకుని దిగ్విజయంగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ అల్టిమేట్ బ్లాక్ బస్టర్ లను సాధిస్తూ దూసుకు పోతున్న ఇండస్ట్రీ. ఇందుకు అందరూ గర్వపడుతుంటే మన దగ్గర సినిమా ప్రేమికులు సినిమాలను ఏ రేంజ్ లో ఆదరిస్తున్నారో చూసి ప్రతీ ఇండస్ట్రీ కూడా విస్తుపోతుంది. ఇది చూసి టాలీవుడ్ వాళ్ళలో కొందరు మాత్రం… ఆడియన్స్ ఆసక్తిని మరింత ఎక్కువగా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.
సినిమా క్రేజ్ లాంటివి పక్కకు పెట్టి కొంచం నోటబుల్ మూవీ అయితే చాలు ఆ సినిమా కి టికెట్ హైక్స్ పెట్టడం మొదలు పెడుతున్నారు. అది ఒకటి రెండు సినిమాలకు తప్పితే ఈ ఇయర్ ఏ సినిమాకి వర్కౌట్ కాలేదు. సంక్రాంతి మూవీస్ కి టికెట్ హైక్స్ పెట్టారు అంటే…
అప్పుడు సీజన్ అండ్ 50% ఆక్యుపెన్సీ ఉంది కాబట్టి ఆడియన్స్ ఆ రేట్లు పెట్టినా థియేటర్స్ కి వచ్చారు. తర్వాత సడెన్ గా భారీ హైప్ ను తెచ్చుకున్న ఉప్పెన కి టికెట్ హైక్స్ పెట్టినా జనాలు ఆదరించారు. దాంతో ఇక నోటబుల్ మూవీస్ అన్నింటికీ టికెట్ హైక్స్ పెట్టడం స్టార్ట్ చేశారు.
అది భారీగా ఎఫెక్ట్ చూపింది చెక్ మరియు శ్రీకారం సినిమాలకు… చెక్ ఎక్స్ పెరిమెంటల్ మూవీ అయినా టికెట్ హైక్స్ పెడితే జనాలు చూడలేదు, ఇక శ్రీకారం టాక్ బాగున్నా టికెట్ హైక్స్ వలన కామన్ ఆడియన్స్ పట్టించుకోలేదు. అదే టైం లో నార్మల్ రేట్లతోనే జాతిరత్నాలు సంచలనాలను సృష్టించింది. ఇక ఇప్పుడు నితిన్ రంగ్ దే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
పర్వాలేదు అనిపించే క్రేజ్ ని సొంతం చేసుకున్నా టికెట్ హైక్స్ భారీ గా పెట్టడం తో వీకెండ్ కి వరకు కలెక్షన్స్ వచ్చినా వర్కింగ్ డేస్ లో భారీ డ్రాప్స్ వచ్చాయి. డే 5… 73 లక్షల షేర్ నే సొంతం చేసుకుంటే డే 6… 40 లక్షలు కూడా డౌట్ గా మారింది ఇప్పుడు… దాంతో టికెట్ హైక్స్ కి మరో సినిమా బలి అయినట్లు అయింది… ఈ సినిమా విషయంలో కోవిడ్ మళ్ళీ రెచ్చిపోవడం కొంచం ఇంపాక్ట్ చూపినా కానీ టికెట్ హైక్స్ మేజర్ రోల్ ప్లే చేశాయి. ఇకనైనా మేకర్స్ ఈ టికెట్ హైక్స్ ఆపుతారో లేదో చూడాలి.