Home న్యూస్ రంగ్ దే రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్!

రంగ్ దే రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్!

0

యూత్ స్టార్ నితిన్ కీర్తి సురేష్ ల కాంబినేషన్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ రంగ్ దే. లాస్ట్ ఇయరే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఎట్టకేలకు ఇప్పుడు OTT ఆఫర్స్ కి నో చెప్పి ఆడియన్స్ ముందుకు సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే…

చిన్నప్పటి నుండి పక్కింట్లో ఉండే హీరోయిన్ అంటే హీరో కి పడదు, కానీ హీరోయిన్ కి హీరో అంటే ఇష్టం, కానీ వీళ్ళ గిల్లికజ్జాలు అలా పెరిగి పెరిగి పెద్దయ్యాక కూడా అలానే ఉండగా, హీరోయిన్ డేర్ చేసి ఒక పని చేస్తుంది, ఆ పని వల్ల హీరో తప్పక హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.

పెళ్లి తర్వాత హీరో హీరోయిన్స్ అలానే కొట్టుకుంటూ ఉన్నారా కలిసారా లేదా అన్నది సినిమా కథ… ఆల్ మోస్ట్ ట్రైలర్ లోనే సినిమా కథ మొత్తాన్ని చూపెట్టారు. సినిమా కూడా సీన్ బై సీన్ అలానే సాగుతుంది కూడా… కానీ ఇక్కడ ఫస్టాఫ్ సాలిడ్ ఎంటర్ టైన్ మెంట్ ని ఇస్తూ సింగిల్ లైన్ పంచులు బాగా మెప్పించగా…

కీర్తి సురేష్ అల్లరి అమ్మాయిగా బాగానే నటించగా సెకెండ్ ఆఫ్ లో ఎమోషనల్ సీన్స్ లో కూడా అద్బుతంగా నటించి మెప్పించింది, ఇక యూత్ స్టార్ నితిన్, అటు తన కామెడీ టైమింగ్ తో సింపుల్ లుక్స్ తో బాగా మెప్పించాడు, ఎమోషనల్ సీన్స్ లో కూడా నితిన్ తన పెర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడు. ఇక ఫాదర్ గా నరేష్ నటన ఆకట్టుకోగా, నితిన్ కి నరేష్ కి సీన్స్ బాగున్నాయి.

ఇక వెన్నెల కిషోర్ కామెడీ కూడా అక్కడక్కడ మెప్పించగా మిగిలిన యాక్టర్స్ కూడా ఉన్నంతలో బాగానే మెప్పించారు, ఇక సంగీతం విషయానికి వస్తే దేవి మార్క్ సాంగ్స్ కాకున్నా సెకెండ్ ఆఫ్ 2 సాంగ్స్ బాగున్నాయి, ఫస్టాఫ్ సాంగ్స్ బిలో యావరేజ్. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు ఈ సారి. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా సాదాసీదాగా ఉంటుంది…

కథ పాయింట్, తర్వాత సీన్స్ అన్ని కూడా ఆడియన్స్ ఊహలకు తగ్గట్లుగానే సాగుతాయి. సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే వెంకీ అట్లూరి చాలా సింపుల్ కథని చాలా వరకు ఎంటర్ టైన్ మెంట్ ని జోడించి బాగానే చెప్పాడు అనిపిస్తుంది… సెకెండ్ ఆఫ్ ఎమోషనల్ సీన్స్ కి కొంచం ఎక్కువ లెంత్ పెట్టడం కొంచం బోర్ కొట్టింది కానీ..

ఫస్టాఫ్ మొత్తం బాగా వర్కౌట్ అయింది, సెకెండ్ ఆఫ్ సగం వరకు కూడా ఆ ఫ్లో మిస్ కాలేదు. కానీ తర్వాత సినిమా కొంచం గాడి తప్పడం, కథ మరీ రొటీన్ అయిన ఫీలింగ్ కలగడం లాంటివి జరగగా క్లైమాక్స్ కూడా సింపుల్ గా ముగుస్తుంది. మొత్తం మీద సినిమా కథ చాలా రొటీన్, కానీ రొటీన్ కథలో ఎమోషనల్ సీన్స్ అంతగా కనెక్ట్ కాకపోవడం…

ఆ సీన్స్ ని ఆడియన్స్ ఊహలకు తగ్గట్లు సాగడం…ఎమోషనల్ సీన్స్ లెంత్ ఎక్కువ అవ్వడం లాంటివి సినిమాకి మేజర్ డ్రా బ్యాక్స్, ఫస్టాఫ్ వరకు ఆడియన్స్ కి ఓకే కానీ..సెకెండ్ ఆఫ్ ఆ ఎమోషనల్ సీన్స్ అండ్ స్లో నరేషన్ ని ఆడియన్స్ ఎంతవరకు ఓన్ చేసుకుంటారో చూడాలి…… సినిమా మరీ అద్బుతం కాదు కానీ ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది… సినిమాకి ఫైనల్ గా మా రేటింగ్ 2.75 స్టార్స్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here