బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో హిట్ కి దూరంగా స్టార్స్ చాలా మందే ఉన్నారు…వాళ్ళలో యూత్ స్టార్ నితిన్(Nithiin) కూడా ఒకరు… 2020 టైంలో ఇలానే వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న టైంలో భీష్మ(Bheeshma Movie) తో బ్లాక్ బస్టర్ కొట్టిన నితిన్ తర్వాత మాత్రం వరుస పెట్టి నిరాశ కలిగించే రిజల్ట్ లను సొంతం చేసుకున్నాడు…
భీష్మ తర్వాత చేసిన చెక్, రంగ్ దే, మేస్ట్రో(డిజిటల్ రిలీజ్), మాచర్ల నియోజకవర్గం మరియు ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ఇలా వరుస పెట్టి నిరాశ పరిచే రిజల్ట్ లు సొంతం అవ్వగా ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీస్ రాబిన్ హుడ్(RobinHood Movie 2024) మరియు తమ్ముడు(Thammudu Movie 2024) సినిమాలు చేస్తున్నాడు నితిన్…
కాగా ఇప్పుడు టాలీవుడ్ లో స్ట్రాంగ్ గా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలు అని అంటున్నారు. భారీ కాన్వాయ్ తో రూపొందుతున్న ఈ సినిమాల బడ్జెట్ లెక్క ఒక్కో సినిమాకి ఓవరాల్ గా 65-70 కోట్ల రేంజ్ లో ఉంటాయని అంచనా వేస్తున్నారు…
అందరి రెమ్యునరేషన్ లకే చాలా మొత్తం వెళుతుందని, మిగిలిన బడ్జెట్ తో షూటింగ్ జరుగుతుందని అంటున్నారు. ఈ రేంజ్ బడ్జెట్ అంటే రికవరీకి కష్టపడాలి కానీ మంచి నాన్ థియేట్రికల్ మార్కెట్ ఉన్న హీరోలలో నితిన్ కూడా ఒకరు అవ్వడంతో బడ్జెట్ ఎక్కువ అయినా కూడా నాన్ థియేట్రికల్ రైట్స్ తో చాలా వరకు కవర్ అవుతుందని నమ్ముతున్నారు…
అయినా కూడా వరుస ఫ్లాఫ్స్ లో కూడా ఈ రేంజ్ లో బడ్జెట్ తో సినిమా లు అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 4 ఏళ్ళుగా హిట్ అందుకునోని నితిన్ ఈ రెండు సినిమాలతో సాలిడ్ కంబ్యాక్ ను ఎక్స్ పెర్ట్ చేస్తున్నాడు. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో త్వరలో తేలనుంది….