టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన లేటెస్ట్ మూవీ భోలా శంకర్(Bholaa Shankar) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకుని తర్వాత ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం ఇంపాక్ట్ ని కూడా….
చూపించలేక తీవ్రంగా నిరాశ పరిచే విధంగా బాక్స్ ఆఫీస్ రన్ ని చాలా త్వరగా ఇప్పుడు పూర్తి చేసుకుంది. సినిమా ఒక్కో ఏరియాలో పరుగు ఆల్ మోస్ట్ ఎండ్ అవ్వగా ఇప్పుడు నైజాం ఏరియాలో సినిమా టోటల్ రన్ ఆల్ మోస్ట్ పూర్తి అయ్యిందని చెప్పాలి ఇప్పుడు..
సినిమాను నైజాం ఏరియాలో మొత్తం మీద 22 కోట్ల రేంజ్ రేటుకి అమ్మారు…వాల్తేరు వీరయ్య భారీ బ్లాక్ బస్టర్ అయినా కూడా నార్మల్ రేటుకే భోలా శంకర్ రైట్స్ ను అమ్మినా కూడా సినిమా మొదటి రోజు నుండే ఇక్కడ పెద్దగా ఇంపాక్ట్ ని చూపించలేక పోయింది…
వీకెండ్ తర్వాత డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని కూడా సొంతం చేసుకున్న సినిమా రెండో వీకెండ్ లో లిమిటెడ్ షేర్స్ వచ్చినా వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా స్లో అయిపోయి ఇప్పుడు ఆల్ మోస్ట్ 7 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ రన్ ని పూర్తి చేసుకుంది ఇప్పుడు..
అంటే 22 కోట్ల వాల్యూ బిజినెస్ కి 7 కోట్లు మాత్రమే రికవరీ చేసిన భోలా శంకర్ సినిమా ఆల్ మోస్ట్ బిజినెస్ లో 15 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని డబుల్ డిసాస్టర్ గా ఇక్కడ పరుగును పూర్తి చేసుకుంది. మిగిలిన ఏరియాలలో కూడా సినిమా లాస్ లు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది.