Home న్యూస్ నైజాం గడ్డపై చరిత్ర సృష్టించిన భీమ్లా నాయక్….ఆల్ టైం రికార్డ్!!

నైజాం గడ్డపై చరిత్ర సృష్టించిన భీమ్లా నాయక్….ఆల్ టైం రికార్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అల్టిమేట్ ఓపెనింగ్స్ ను రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా ఆంధ్రలో లో టికెట్ రేట్స్ వలన సినిమా కి ఇబ్బంది ఎదురు అయినా కానీ నైజాం లో మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన కలెక్షన్స్ తో దుమ్ము లేపింది…

సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా నైజాం ఏరియాలో ఆల్ టైం ఎపిక్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది, ఇక్కడ సినిమాకి టికెట్ హైక్స్ ఉన్నప్పటికీ కూడా సింగిల్ స్క్రీన్స్ లో 175 టికెట్ రేటుని ఫిక్స్ చేయగా రీసెంట్ బిగ్గీ పుష్ప సినిమా కి…

ఇక్కడ సింగిల్ స్క్రీన్స్ లో కూడా 200 వరకు పెట్టారు…. దాంతో ఓవరాల్ గా రిలీజ్ లు ఆల్ మోస్ట్ సేమ్ లెవల్ లో ఉండటంతో భీమ్లా నాయక్ పుష్ప కలెక్షన్స్ ని అందుకుంటుందా లేదా అన్నది ఆసక్తిగా మారగా సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ కలెక్షన్స్ ని దాటేసి….

ఇప్పుడు నైజాం గడ్డ మీద అల టైం రికార్డ్ ఓపెనింగ్స్ ను అందుకుని సంచలనం సృష్టించింది. పుష్ప సినిమా ఇక్కడ మొదటి రోజు 11.44 కోట్ల షేర్ ని అందుకోగా ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా ఇక్కడ 11.85 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది…. టికెట్ రేట్స్ 200 ఫిక్స్ చేసి ఉంటే ఈ మార్జిన్ మరింత ఎక్కువగా ఉండేది…

మొత్తం మీద రికార్డుల పరంగా నైజాంలో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన పవర్ స్టార్ భీమ్లా నాయక్ తో న్యూ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని ఇక్కడ సొంతం చేసుకున్నాడు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఇక్కడ ఇంకా ఎలాంటి హోల్డ్ తో వసూళ్ళని సొంతం చేసుకుని సత్తా చాటుతుందో చూడాలి. లాంగ్ రన్ లో కచ్చితంగా ఇక్కడ సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here