బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మేజర్ కలెక్షన్స్ వచ్చే ఏరియాల్లో నైజాం ఏరియా మార్కెట్ రేంజ్ రీసెంట్ టైంలో భారీగా పెరిగిపోయింది. ఇది వరకు ఆంధ్ర రీజన్ కి సమంగా వచ్చే కలెక్షన్స్ ఈ మధ్య చాలా సినిమాలకు టోటల్ ఆంధ్రప్రదేశ్ కి తీసిపోని విధంగా ఇక్కడ వసూళ్ళ జాతర సృష్టిస్తున్నాయి…2024 ఇయర్ లో కొన్ని సినిమాలు ఇక్కడ…
సాలిడ్ కలెక్షన్స్ తో కుమ్మేశాయి కూడా…ఇయర్ మొదట్లో హనుమాన్ మూవీ దుమ్ము లేపితే తర్వాత కల్కి మూవీ అలాగే దేవర సినిమాలు ఇక్కడ ఊహకందని రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకున్నాయి…నైజాం ఏరియాలో ఓవరాల్ గా ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని…
అందుకున్న సినిమాల పరంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పటికీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఏకంగా 111.85 కోట్ల రేంజ్ రేటుతో సంచలనం సృష్టిస్తూ దూసుకు పోతూ ఉంది…కల్కి మూవీ తర్వాత ప్లేస్ లో ఎంటర్ అవ్వగా టాప్ లిస్టులో ప్రభాస్ సినిమాలు ఎక్కువ డామినేట్ చేశాయి రీసెంట్ టైంలో…
ఒకసారి నైజాం ఏరియా లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించిన టాప్ సినిమాలను ఒకసారి గమనిస్తే…
Nizam Area all time Top 10 Share Movies list
1). #RRRMovie -111.85CR
2). #KALKI2898AD: 92.80Cr
3). #Salaar – 71.40CR
4). #Baahubali2: 68Cr
5). #Devara Part 1: 62.90CR****
6). #AlaVaikunthaPurramuloo: 44.88Cr
7). #Baahubali: 43Cr
8). #KGFChapter2(Dub): 42.93CR
9). #Pushpa – 40.74Cr
10). #SarileruNeekevvaru: 39.97Cr
11). #Hanuman – 39.25CR
12). #AdiPurush – 39.20CR
13). #WaltairVeerayya – 36.25CR
14). #BheemlaNayak: – 35.02Cr
15). #GunturKaaram: – 33.85Cr
రీసెంట్ గా ఈ లిస్టులో దేవర ఎంటర్ అవ్వగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప2 నుండి మొదలుకొని 2025 లో చాలా వరకు టాప్ అండ్ క్రేజీ సినిమాలు రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉన్నాయి. మరి అప్ కమింగ్ మూవీస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీని దాటేసి కొత్త రికార్డ్ ను నమోదు చేసే సినిమాగా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి.